తమ కాల్‌సెంటర్లలో వరుసగా నాలుగోరోజూ దిల్లీ పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ దిల్లీలోని ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయం ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఆందోళనకు దిగింది. దిల్లీలో 30 లక్షల ఓట్లు గల్లంతు కావడానికి భాజపానే కారణమని ఆరోపించింది. ఆ విషయమై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను అద్దెకు తీసుకున్నామని చెబుతోంది. భాజపా చెప్పినట్లు చేస్తున్న దిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, పలువురు ఆప్‌ అభ్యర్థులు.. శుక్రవారం భారత ఎన్నికల ప్రధాన కమిషనరు(సీఈసీ) సునీల్‌ అరోడా సహా మొత్తం ముగ్గురు కమిషనర్లను కలిశారు.

magunta 16032019

సీఈసీని కలసి వచ్చిన గంటలోపే పోలీసులు నాలుగోసారి కాల్‌సెంటర్‌పై దాడి చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్‌ నాయకులు ‘ఈసీ’ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈసీ దిగివచ్చింది. దిల్లీ పోలీసులు, ఆప్‌ నాయకులతో పరిస్థితిని సమీక్షించింది. సమావేశం అనంతరం మనీశ్‌ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ దిల్లీ పోలీసుల ప్రమేయం లేకుండా కాల్‌సెంటర్‌ ఉదంతంపై దర్యాప్తు జరపడానికి ఈసీ అంగీకరించిందని చెప్పారు. మరోవైపు తమ కాల్‌సెంటర్లపై ‘సీఈసీ’ ఎందుకు దాడులు చేయిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

magunta 16032019

వాస్తవానికి భాజపా నాయకులు శుక్రవారం ఉదయమే అరోడాను కలిశారు. కాల్‌సెంటర్లు పెట్టి ఓటర్ల జాబితాపై ఓటర్లను ఆప్‌ తప్పుదారి పట్టిస్తోందని ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్‌ తదితరులపై పరువునష్టం కేసు.. ‘భాజపా’ లక్షల ఓట్లు తొలగించిందని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నాయకులపై పరువునష్టం కేసు దాఖలైంది. దిల్లీ యూనిట్‌కు చెందిన భాజపా నాయకుడు రాజీవ్‌ బబ్బర్‌ ఫిర్యాదు మేరకు దిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ శుక్రవారం సమన్లు జారీ చేశారు.a

Advertisements