మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెమనాయుడుకి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయ్యి, జ్యుడీషియాల్ రిమాండ్ లో అచ్చమనాయుడు ఉన్నారు. రెండు రోజుల నుంచి ఆయనకు జలుబు చెయ్యటంతో, ఆయనకు హాస్పిటల్ వైద్యులు కరోనా పరీక్షలు చెయ్యటంతో, ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో హాస్పిటల్ యాజమాన్యం, ఈ విషయం హైకోర్టుకు సమాచారం అందించింది. అయితే దీని పై తమకు అధికారికంగా ఒక లేఖ ద్వారా ఈ విషయం చెప్పాలని, హైకోర్టు ఆదేశించింది. అయితే అచ్చెమనాయుడుని ఈఎస్ఐ కేసులో ప్రభుత్వం అరెస్ట్ చేసి, శ్రీకాకుళం నుంచి, విజయవాడ వరకు, పైల్స్ ఆపరేషన్ జరిగింది అని చెప్పినా, అలాగే తీసుకురావటం, ఆయన్ను 15 గంటలు 600 కిమీ తిప్పటం, ఇవన్నీ చెయ్యటంతో, ఆయనకు బ్లీడింగ్ ఎక్కవ అయ్యి, ఆపరేషన్ ఫెయిల్ అవ్వటంతో, మరో సారి ఆపరేషన్ చేసారు. ఇదంతా ఆయన జ్యుడీషియాల్ రిమాండ్ లో ఉండగానే జరిగింది.

అయితే దీని పై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఇష్టం వచ్చినట్టు తిప్పితే, ఈ పరిస్థితిలో కరోనా లాంటివి వచ్చే అవకాసం ఉందని, ఆయన ఎక్కడికీ పారిపోరు కదా, విచారణ చేసుకోవచ్చు కదా అని చెప్పినా, ఆయన్ను అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో ఆయనను గుంటూరు జీజీహెచ్ నుంచి, విజయవాడ సబ్ జైలుకు తీసుకు రావటం పై కూడా, టిడిపి అభ్యంతరం చెప్పింది. ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రెండు ఆపరేషన్ లు జరిగాయని, కోర్టులో కేసు వెయ్యటంతో, ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళటానికి కోర్టు ఒప్పుకుంది. ఆ సమయంలో ఆచ్చెమనాయుడు పై ప్రవర్తించిన తీరు పై, కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరి అక్కడ కరోనా ఎలా సోకింది అనే విషయం పై ఆరా తీస్తున్నారు. ఈ విషయం పై, ఆయనకు అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారా, లేదా వేరే చోటుకి తరలిస్తారా అనే దాని పై హైకోర్టు ఇచ్చే ఆదేశాల పై ముందుకు వెళ్లనున్నారు.

Advertisements