జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, చంద్రబాబు హయంలో ఆక్టివ్ గా, పని చేస్తూ, చంద్రబాబుకి సహకరించిన సీనియర్ ఐఏఎస్ ల పై ప్రభుత్వం కక్ష తీర్చుకుంది అనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంటలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావుకి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే 48 మంది డీఎస్పీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ పరిస్థితిలో, ఐఏఎస్ లు కూడా టార్గెట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు సిఈఓగా పని చేస్తున్న జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారం పై కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి. కృష్ణ కిషోర్ తాను, తన మాతృ సంస్థకు వెళ్ళిపోతాను అని, కేంద్రానికి వెళ్లిపోవటానికి తనను రిలీవ్ చెయ్యాలని కోరగా, అతనిని రిలీవ్ చెయ్యకుండా, చివరకు అతను అవినీతి చేసారు అంటూ కేసులు పెట్టారు. రాత్రికి రాత్రి ఎంక్వయిరీ వేసారు. ఎంక్వయిరీ అయ్యే వరకు రిలీవ్ చెయ్యం అని చెప్పారు. అయితే ఈ విషయం పై కృష్ణ కిశోరే క్యాట్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసారు. ఈ విషయం ఇంకా విచారణలో ఉంది.

విచారణ జరుగుతున్న సందర్భంలో, క్యాట్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, ఇలా ఒక అధికారి పై ఎందుకు కక్ష గట్టింది అంటూ మొదటి సారి జరిగిన విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక అలాగే, రెండో సారి విచారణలో, తాము జాస్తి కృష్ణ కిషోర్ కి, జీతం ఇవ్వమని చెప్పినా ఎందుకు ఇవ్వలేదు అంటూ ఫైర్ అయ్యారు. చీఫ్ సెక్రటరీ వచ్చి మాకు సమాధానం చెప్పాలి అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది ట్రిబ్యునల్. దీంతో వెంటనే గంటలోనే జీతం ఇచ్చిన ఏపి అధికారులు, ఈ విషయం పై ట్రిబ్యునల్ కు చెప్పటంతో, అయినా ట్రిబ్యునల్ శాంతించలేదు. జీతం ఎందుకు లేట్ అయ్యిందో చెప్పాలని, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఇంత ఇదిగా ఈ కేసు నడుస్తున్న టైంలో, ఇప్పుడు ఒక నివేదిక వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు, గత మూడేళ్లలో ఖర్చు పెట్టిన ఖర్చు వివరాలు, అలాగే చేసిన నియమకాలు అన్ని నిబంధనలు ప్రకారమే ఉన్నాయని, ఆడిట్‌ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి, ఒక పత్రికలో వచ్చిన వార్త, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రయాణ, ప్రకటన, వసతి, స్టేషనరీ ఖర్చులు, జీతభత్యాల చెల్లింపు తదితరాల్లో నిబంధనల మేరకే నిధులు ఖర్చు చేశారని ఆ నివేదికలో ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ నివేదిక రావటంతో, ఈ కేసు మొత్తంలోనే ట్విస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ నివేదిక ప్రకారం, ప్రభుత్వ ఆరోపిస్తున్నట్టు, కృష్ణ కిషోర్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు అనే విషయం అర్ధమవుతుంది. మరి ఈ విషయం పై, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements