ఇసుక సమస్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 40లక్షల కుటుంబాలు ఉపాధి లేక పస్తులు ఉంటున్నాయి. 5 నెలలు తరవాత అయినా ఇసుక వస్తుందని, తమకు ఉపాధి వదొరుకుతుందని వీళ్ళు పెట్టుకున్న ఆశలు బూడిదలో పోసిన పన్నీరులా నీరుగారిపోయాయి. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసున్నా, ఇసుక మాత్రం అందుబాటులోకి రావటం లేదు. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులు అయోమాయంలో ఉన్నారు. వరదలు తగ్గాయి ఏదోలా ఇసుక పంపిణి జరుగుతుంది వీరు ఆశ పడ్డా, ఏమి జరగటం లేదు. ఇసుక కొద్ది కొద్దిగా దొరుకుతున్నా, దాని ధర చూసి కళ్ళుతిరిగాయ్. చంద్రబాబు హయంలో మొన్నటి వరకు ట్రాక్టర్ ఇసుక 2000 నుంచి 3000 ఉండేది. ఇప్పుడు ఒకసారి గా ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయ్. ఇప్పుడు అదే ట్రాక్టర్ 6000 నుంచి 7000 పలుకుతుంది. అయితే ఇసుక ఫ్రీ అవుతుందని, అని భవన నిర్మాణ కార్మికులు ప్రజలు ఆశ పడుతున్న టైంలో, ఇప్పుడు మరో ఇబ్బని వచ్చి పడింది.

sandissue 111120192

ప్రస్తుత పరిస్థితి అదనుగా భావించి, ఇన్ని రోజులుగా రాబడి లేకపోవటం వలన సిమెంట్ ఫ్యాక్టరీలు ఒక్కసారిగా సిమెంట్ ధరల్ని ఆకాశానికి అంటేటట్లుగా పెంచేశాయి. ఒక్కొక బస్తా మీద 20 నుంచి 30 శాతం ధరని పెంచారు. ఒక నెల క్రితం వరకు ఒక సిమెంట్ బస్తా 250 నుంచి 270 వరకు ఉంటే, దానిని ఇపుడు 380 నుంచి 400 చేసారు. పాత సిమెంట్ బస్తాలకి కూడా అదే రేటుతో విక్రయంచాలని సిమెంట్ ఫ్యాక్టరీ అధినేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇంత రేట్లు పెట్టి సిమెంట్ ని ఎలా కొనగలం అంటూ నిర్మాణాలు చేసే వారు చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పటికే ఇసుక లేక ఇబ్బంది పడుతున్నామని, ఇపుడు సిమెంట్ కూడా మండితే, ఇక భవన నిర్మాణ కార్మికులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు అని చెప్పాలి.

sandissue 11112019 3

ఇపుడు మళ్ళీ సిమెంట్ రేట్లు తగ్గించమని సమ్మె లు, ధర్నా లు చేయాలిసిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. వైసీపీ ప్రభత్వం వచ్చినప్పటి నుంచి తినడానికి తిండి కూడా దొరకట్లేదు అని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా, ఇదే విషయం పై పోరాటాలు చేస్తున్నాయి. వరదలు తగ్గాయి, ఇసుక ఫ్రీ అవుతుంది అని ప్రభుత్వం అనుకునే లోపే, సిమెంట్ ధరలు పెరగటంతో, ఈ కొత్త గొడవ ఏంటిరా బాబు అని వైసీపీ ప్రభుత్వం తల పట్టుకుంటుంది. ఒక తొందర పాటు నిర్ణయం ఎన్ని అనర్ధరాలకి దారి తీస్తుందో ప్రజలకు అర్ధమవుతుంది. చేతులు కాలాక ఆకులూ పట్టుకుంటే ఎం లాభం. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisements