ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త ఇసుక పాలసీ వస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఇసుక ఫ్రీగా ఇచ్చే వారు. కేవలం రవాణా చార్జీలు పెట్టుకుంటే సరి పోయేది. ట్రాక్టర్ 1500, లారీ 4 వేలుకు ఇసుక దొరికేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, కొత్త ఇసుక పాలసీ తెచ్చారు. అప్పటి నుంచి అటు నిర్మాణాలు చేసే వారికి, ఇటు పనులు చేసుకునే వారికి, ఇసుక దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక రేటు కూడా నాలుగు అయుదు రెట్లు పెరిగింది. అయితే కొత్త పాలసీ కాబట్టి కొంత సమయం పడుతుందని భావించినా, 18 నెలలు అయినా అవే కష్టాలు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటంతో, కొత్త ఇసుక పాలసీ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ కొత్త ఇసుక పాలసీ రిపోర్ట్ ని, ఈ రోజు జరిగిన క్యాబినెట్ ముందు పెట్టింది. క్యాబినెట్ ఆ రిపోర్ట్ ని ఆమోదించింది. దీంతో కొత్త ఇసుక పాలసీ త్వరలోనే, అందుబాటులోకి రానుంది. అయితే ఈ కొత్త ఇసుక పాలసీ పై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఇసుక రీచ్ లు అన్నీ ఒక సంస్థకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ ఇసుక రీచ్ లు నిర్వహణ బాధ్యతలు అప్ప చెప్పాలని, ఒకవేళ కేంద్ర సంస్థలు ముందుకు రాకపోతే, పేరు గాంచిన ప్రైవేటు సంస్థలకు ఓపెన్ టెండర్ ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

sand 05112020 2

అయితే ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఇలా ఒకే సంస్థకు ఇస్తే, అవినీతిని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు రాకపోతే, ప్రముఖ కంపెనీకి మొత్తం ఇసుక రీచ్ లు ఇచ్చేస్తాం అని చెప్పటంలోనే గోల్ మాల్ ఉందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇది ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని, ఒక బడా కాంట్రాక్టర్ కు కట్టబెట్టే నిర్ణయం అని, దీని వెనుక దోచుకునే కుట్ర ఉంది అంటూ తెలుగుదేశం నేత బొండా ఉమా ఆరోపిస్తున్నారు. మేము గత నెల రోజులగా ఆరోపిస్తున్నట్టే, ఒకే ప్రైవేటు సంస్థకు ఇసుక అప్పచేప్తున్నారని, ఆ ఒక్కరు ఎవరో అందరికీ తెలుసు అని విమర్శించారు. గతంలో రెడ్డి అండ్ కంపెనీ ఇసుకను దోచేస్తే, ఇప్పుడు శేఖర్ రెడ్డి అనే ఇసుకమాఫియా కింగ్ కు రాష్ట్రంలోని ఇసుకను గంపగుత్తగా అప్పగించబోతున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఏపీలో ఏపీఎండీసీ సంస్థ ఉందని, ఈ ప్రభుత్వానికి నిజంగా మేలుచేయాలన్న చిత్తశుద్ధే ఉంటే, ఇసుకసరఫరా బాధ్యతను ఆసంస్థకు ఎందుకు అప్పగించడంలేదని, ఉచిత ఇసుక విధానాన్ని ఎందుకు అమలుచేయడంలేదని బొండా ఉమా ప్రభుత్వాన్ని నిలదీశారు.

Advertisements