జగన్ మోహన్ రెడ్డి పై, అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేసారు. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారని, ఇప్పటి వరకు ఏది నెరవేర్చలేదని, చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. అంతే కాదు, అసలు జగన్ మమ్మల్ని కలవటానికి ఇష్టపడటం లేదని, తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని సంచలన ఆరోపణలు చేసారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ వివాదం మళ్ళీ రేగెంది. పాదయాత్ర సమయంలో ఊరు ఊరు తిరిగి, అగ్రిగోల్ద్ బాధితులను దగ్గరకు తీసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, వారికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం అధ్యక్షుడు చేసిన ఆరోపణలు, దుమారం రేపాయి.

agrigold 13092019 2

అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముంది అగ్రిగోల్డ బాధితులకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చ్ద్సారు. జగన్ మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే, 1150 కోట్లు మంజూరు చేస్తున్నామని, 20 వేల లోపు డిపాజిట్లు ఉన్న వారికి చెల్లింపులు చేస్తాం అని చెప్పారని, కాని అవి మాటల వరకే పరిమితం అయ్యాయని అన్నారు. ఇప్పటి వరకు మూడు నెలలు పైగా గడిచినా, ఈ ఆదేశాలకు సంబంధించి జీవో మాత్రం ఇవ్వలేదని అన్నారు. అలాగే గతంలో చంద్రబాబు ప్రభుత్వం 10 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రూ.200 కోట్లు మంజూరు చేసిందని, కనీసం ఆ నిధులనైనా విడుదల చెయ్యాలని, జగన్ ప్రభుత్వాని కోరారు.

agrigold 13092019 3

చంద్రబాబు కేటాయించిన 200 కోట్లు అయినా ఇస్తే, 4 లక్షల మందికి న్యాయంజరుగుతుందని, కనీసం అదైనా చెయ్యాలని కోరారు. అలాగే చనిపోయిన వారికీ 10 లక్షలు ఇస్తామని జగన్ అన్నారని, ఆ హామీ కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని అన్నారు. జగన్ మొహన్ రెడ్డి గారు మాకు హామీ ఇస్తూ, గ్రామ, వార్డు వాలంటీర్లు అగ్రిగోల్డ్ బాధితుల ఇళ్లకు వెళ్లి రశీదులు అందజేస్తారని చెప్పారని, కాని ఇప్పటి వరకు అలాంటిది ఏమి జరగలేదని అన్నారు. ఎన్నికల ముందు అన్ని మాటలు చెప్పి, ఇప్పటికి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా, నేటికీ అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 లక్షల మంది బాధితుల తరుపున పోరాటం చేస్తున్న మాకు జగన్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. బాధితులు అందరికీ న్యాయం జరిగే వరకు, మేము పోరాటం చేస్తామని అన్నారు.

Advertisements