ఈ రోజు రాజధాని అమరావతిలో జగన్ సభకు విద్యాసంస్థల బస్సులను లాక్కున్నారు అధికారులు. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు ఉన్నా బస్సులను బెదిరించి అధికారులు లాక్కోవటంతో విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులు ఇవ్వలేమని చెప్పినా కళాశాలల యాజమాన్యాలపై అధికారులు ఒత్తిడి తెచ్చారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకే యాజమాన్యాల నుంచి బస్సులు తీసుకున్నారు. బస్సులు ఇవ్వకపోతే ఎలా తిరుగుతాయో చూస్తామంటూ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు. రాజధానిలో సీఎం సభకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకెళ్లేందుకు విద్యాసంస్థల బస్సులు అవసరమని అధికారులు చెప్పారు. అయితే, విద్యార్థులు పరీక్షల సమయం అని, వారు హాజరయ్యేందుకు బస్సులు అవసరమని కళాశాలల యాజమాన్యాలు చెప్పాయి. అయినప్పటికీ, అధికారులు విద్యార్థుల పరీక్షలను పట్టించుకోకుండా బస్సులను లాక్కున్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బస్సులను బలవంతంగా తీసుకువెళ్లి సీఎం సభకు పంపేలా బెదిరించిన ప్రభుత్వం ఈ చరిత్రలోనే లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisements