గతంలో, అంటే 2010లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతికి కారణం అంటూ, ఆఫీసులు తగలబెట్టిన వైసీపీ కార్యకర్తలు, ఈ రోజు తమ అధినేత చేసిన పనితో షాక్ అయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ముకేష్ అంబానీ వస్తున్నట్టు కాని, ఆయనతో జగన్ భేటీ ఉంటుంది అని కాని ముందు ఎలాంటి లీక్ కూడా ఇవ్వలేదు. అయితే ముకేష్ అంబానీ పెట్టుబడులు కోసం చర్చలు జరపటానికి వచ్చారా ? లేక మరేదైనా కారణమా అంటే, వేరే కారణం అనే రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి అంతటికీ కారణం, ముకేష్ అంబానీతో పాటు వచ్చిన వ్యక్తి. ముకేష్ అంబానీతో పాటుగా కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యులు పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ కూడా జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. పరిమల్ నత్వానీ, అంబానీకి చాలా దగ్గర మనిషి. అయితే ఈ భేటీ వెనుక పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వటం విషయంలోనే చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.

mukesh 29022020 2

పరిమల్ నత్వానీ పారిశ్రామికవేత్తగా అందరికీ పరిచయం. 1990 వరకు ఆయన సొంతగా వ్యాపారాలు చేసుకునే వారు. ఈ క్రమంలోనే ఆయన 1997లో రిలయన్స్ గ్రూప్‌లో చేరారు. 2016లో పరిమల్ నత్వానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కార్పొరేట్ అఫెయిర్స్‌కు చీఫ్‌గా పని చేసారు. పరిమల్ నత్వానీకి, ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీతో కూడా మంచి సంబంధాలు ఉండేవి అని చెప్తూ ఉంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ధీరుభాయ్ అంబానీ నెలకొల్పిన మొట్టమొదటి క్రూడ్ ఆయిల్ పరిశ్రమ పనులు అన్నీ, పరిమల్ నత్వానీ దగ్గర ఉండి చూసారని అంటారు. పరిమల్ నత్వానీ, ముఖేష్ అంబానీకి రైట్ హ్యాండ్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయనే, రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చాలా కీలక వ్యక్తి అయిపోయారు.

mukesh 29022020 3

పరిమల్ నత్వానీ రాజకీయంగా కూడా చురుకుగా ఉంటూ వచ్చారు. బీజేపీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. జార్ఖండ్ నుంచి, 2008లో ఒకసారి, 2014లో ఒకసారి ఎన్నికయ్యారు. అయితే ఈయన రాజ్యసభ పదవీ కాలం, ఏప్రిల్ 9తో ముగుస్తుంది. అయితే, జార్ఖండ్‌లో ఈ సారి, బీజేపీకి సరిపడా బలం లేకపోవటంతో, ఆయన అక్కడ నుంచి రాజ్యసభకు వెళ్ళటం అసాధ్యం అయ్యింది. ఈ నేపధ్యంలోనే, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆయన్ను మళ్ళీ రాజ్యసభకు పంపించాలని అమిత్ షా నిర్ణయం తీసుకోవటంతో, ఆ విషయం మాట్లాడటానికి జగన్ ను ఈ రోజు, ముకేష్ తో కలిసి, పరిమల్ నత్వానీ కలిసారని తెలుస్తుంది. డైరెక్ట్ గా అమిత్ షా నిర్ణయం తీసుకోవటంతో, జగన్ కూడా నో చెప్పలేని పరిస్థితి. చూద్దాం, మరి జగన్ ఏమి చేస్తారో.

Advertisements