తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో దాదపుగా 50 మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాష్ట్ర ప్రజల్లో ఈ ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న కూడా ఇలాగే ఒక పెద్ద బొట్ లో, 50 మందిని గోదావరి పర్యటకానికి తీసుకువెళ్ళారు. గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో, ఇలా బొట్ లో వెళ్ళటంతో, నిన్నే అందరూ హెచ్చరించారు. ఈ విషయానికి సంబంధించి ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ లో, కూడా వార్త వచ్చింది. పాపికొండల విహారానికి ప్రమాదకర పరిస్థితుల నడుమ బోట్లు వెళ్తున్నాయని, నదీ విహారానికి ఈ సమయంలో వెళ్తే ప్రమాదం అని ఆ కధనంలో రాసింది.

paper 15092019 1

అధికారులు అక్కడ ఉన్నా సరే, ఆ బోట్‌ను అడ్డుకోకుండా, ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదని ఆ కధనం సారాంశం. ఇప్పటికీ, గోదావరి వరదలతో, దేవీపట్నం మండలంలో ఇంకా 36 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పాపి కొండల విహారానికి వెళ్తే, ప్రమాదం అని ఆంధ్రజ్యోతి తన కధనంలో రాసింది. ఇంత వరద ఉన్నా కూడా, 50 మందితో బోటు వెళ్తే, అధికారులు ఎవరు పట్టించుకోలేదని, ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే, అధికారులు మేల్కునాలి అంటూ ఆంధ్రజ్యోతి కధనం రాసింది. అయితే ఈ కధనం రాసిన 24 గంటల్లోనే, అతి పెద్ద విషాద ఘటన జరిగింది. ఇప్పిటికీ 50 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే ఇంతటి విషాద ఘటన చూసిన ప్రజలు, ఆంధ్రజ్యోతి కధనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

paper 15092019 1

ఆంధ్రజ్యోతి ముందే హెచ్చరించినా, ఎవరూ పట్టించుకోలేదని, ఈ కధనాన్ని ఏ ఒక్క అధికారి చూసినా, ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ పత్రికను, ఛానల్ ను కనపడకూడదు అని అప్రకటిత నిషేధం విధించటంతో.. పాలకపక్షం నాయకులు / అధికారులు బహుశా దీన్ని చూసిఉండరేమో అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే జగన్ గారు, మీడియా లేదా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, అధికారంలో ఉన్నవారు తమ పనితీరుని మెరుగుపరుచుకోవటం లేదా సరిదిద్దుకోవటం కోసం వాడాలి తప్పితే, విమర్శలు వచ్చాయి అని కనపడకూడదు / వినపడకూడదు అంటూ, అది స్వయంగా / సొంతంగా మీడియా అధిపతి అయినా జగన్ గారే ఇలా చేయటంతో, జరిగే తప్పులు ప్రభుత్వానికి తెలిసే అవకాసం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

Advertisements