ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను 2014 ముందు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒకలా మోసం చేస్తే, 2014 తరువాత ఇప్పటి కేంద్ర ప్రభుత్వం మరో రకంగా మోసం చేస్తుంది. ఆ మోసం చేసిన దానిలో అప్పట్లోనూ, ఇప్పుడు పావులు ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులే. ప్రత్యెక హోదా ఇవ్వమని రాజ్యసభలో అడిగింది బీజేపీ నేతలే. చట్టంలో పెట్టించింది బీజేపీ నేతలే. తరువాత ప్రత్యెక హోదా లేదు ఏమి లేదు అని చెప్పింది కూడా ఇదే బీజేపీ నేతలు. అలాగే అనెక్ విభజన హామీల పై ఇదే రకమైన వాదన చేసి, ప్రజలను మభ్య పెట్టి, పబ్బం గడుపుకున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ నోటాతో పోటీ పడుతుంది, ఎలాగూ ఇక్కడ రాదు కదా అనుకున్నారో ఏమో కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా లైట్ తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు పోరాటం. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ప్రైవేటీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా, మేము కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకం అని పోరాటం చేస్తుంది. బీజేపీ మినహా అన్ని రాజాకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు.

somu 20022021 2

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఇప్పుడు రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ గా మారింది. ఈ తరుణంలో రాజకీయంగా వెనుకబడి పోతున్నాం అనుకున్నారో ఏమో కానీ బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. ప్రైవేటీకరణ ఆపేస్తాం, కేంద్రంతో సంప్రదిస్తాం అంటూ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి నేతలు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. అక్కడ ఏమి అయ్యిందో, వారు ఏమి చెప్పారో కానీ, మూడు రోజులు తరువాత ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చి, ప్లేట్ తిప్పెసారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం ఎవరు చేస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి, కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం పై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తున్నామని కేంద్రం ఎక్కడ చెప్పింది అంటూ, ఎదురు దాడి మొదలు పెట్టారు. సోము వీర్రాజు, జీవీఎల్ ఇదే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే కేంద్రం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవటం, ఈ విషయం పై కేంద్రం అధికారికంగా ట్వీట్ చేయటం అందరికీ తెలిసిందే. అయినా సరే తమకు తెలిసిన ఎదురు దాడితో, ఏపి బీజేపీ కొత్తగా మరో ప్రచారం మొదలు పెట్టింది.

Advertisements