రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థుతుల్లో ఏపిలో బీజేపీకి ఉన్న పరిస్థితి, మరీ ముఖ్యంగా కొందరు నాయకుల తీరుపై భగ్గుమంటూ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు ఘాటు లేఖ రసారు.. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడుగా హరిబాబు రాజీనామా చేసిన తరువాత, కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో, తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, కొత్త అధ్యక్షుడికి ఎన్నికకు ముందు తమతో మాట్లాడాలని సూచించారు... రాష్ట్రంలో కొంత మంది బీజేపీ నేతల తీరు పై కూడా, ఆ లేఖలో విరుచుకుపడ్డారు.. సొంత ప్రాంతంలో కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేని కొందరు నాయకులు ప్రజల ముందు, మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు నేతలు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా, సోము వీర్రాజు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా అర్ధమవుతుంది.

అంతే కాదు, ఇంకా కొంత మంది బీజేపీ నాయకులు అవినీతికి మారుపేరుగా మారారన్నారు. 2014 ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన, సీనియర్‌ నాయకులను తీవ్రంగా అవమానిస్తున్నారు... దీనివల్ల వారు బీజేపీని వీడి మరో పార్టీలో చేరక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు... ఒక అసమర్థ నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో తప్పటడుగులు వేస్తే సీనియర్‌ నేతలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు... ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు కూడా పార్టీని వీడిపోయే ప్రమాదం ఉంది'' అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది.

మరో పక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని, పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షా ను కోరడం ఆసక్తికరంగా మారింది... రాష్ట్రంలో పరిస్థితులను అధిష్ఠానానికి వివరించేందుకు కొన్ని రోజులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నా వీలు పడటం లేదు.. రాష్ట్ర పార్టీ నాయకులతో, ప్రజా ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా... వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడమేమిటన్నది వీరి ప్రధాన అభ్యంతరం. కానీ... తమకు అన్నీ తెలుసు అనే వైఖరివల్లో, కర్ణాటక ఎన్నికల వల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సమయం ఇవ్వడంలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Advertisements