ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలకు ఎదురు తిరిగితే అంతే సంగతులు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పీఆర్సీ ప్రకటన సందర్భంగా తమకు అన్యాయం జరిగింది అంటూ, వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు, ప్రొబేషన్ విషయం పై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు నాలుగు రోజులుగా వారి ఆందోళన తారా స్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వం వారికి బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయటం పై అఘ్ర వ్యక్తం చేసారు. విధుల నిర్వహణలో చట్ట నిబంధనలు పాటించ లేదని, విధుల పట్ల నిర్ల్యక్షంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ పై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో చెప్పాలి అంటూ, 24 గంటలు టైం ఇచ్చారు, అనంతపురం కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్. సమాధానం ఇవ్వకపోయినా, సంతృప్తిగా లేక పోయినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే మరో షాక్ ఇస్తూ, విధులకు హాజరు కావటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఒక రోజు జీతం కట్ చేసి, మరో షాక్ ఇచ్చారు. మొత్తానికి, తమకు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.

Advertisements