ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై, ఇక్కడ ప్రజల పై విషం చిమ్మిన విజయసాయి రెడ్డి, ఎన్నికల తరువాత కూడా అదే విషం చిమ్ముతున్నారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలకు రక్షణగా కేంద్ర రక్షణ బలగాలను వినియోగించాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా ఉంచాలని అందులో ప్రధానంగా కోరారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలతో పహారా ఏర్పాటు చేయాలని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపి పోలీసుల పై నమ్మకం లేదని చెప్పూర్. అంతేకాదు 24 గంటల పాటు సీసీకెమెరాల ఏర్పాటు చేయాలని కోరారు.

vsreddy 14042019

అలాగే ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సీఈవోకు చెబుతున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర పోలీసులతో స్ట్రాంగ్ రూమ్ వద్ద పహారా ఏర్పాుట చేయాలని విజయసాయి రెడ్డి లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినందుకు వైకాపా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడాకు శనివారం లేఖ రాశారు. మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు నమోదు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించాలని రాష్ట్ర గవర్నర్‌ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన గవర్నర్‌కు లేఖరాశారు.

vsreddy 14042019

ఇది ఇలా ఉంటే, విజయసాయి రెడ్డికి, రహస్య స్నేహితుడు బీజేపీ కూడా తోడయ్యింది. జగన్ కేసులో ఒక నిందితుడుగా ఉన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యంను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన సందర్భంలోనూ చంద్రబాబు బెదిరింపు ధోరణిలో మాట్లాడారని పేర్కొన్నారు. ఎల్‌వీ సుబ్రమణ్యం నిబద్ధత కలిగిన అధికారి అని ప్రశంసించారు. అయితే ఎల్‌వీ సుబ్రమణ్యం పై కేసు ఉన్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి హాయంలో, కొడుకుకి కట్టబెట్టిన దాంట్లో, ఈయన పాత్ర కూడా ఉందని, సిబిఐ A10 గా చేర్చిన విషయం తెలిసిందే.

Advertisements