మాజీ విమానయాన మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజుకు తీవ్ర అవమానం జరిగింది... అవమానం జరిగింది కూడా, తాను నెల రోజుల క్రిందట మంత్రిగా నిర్వహించిన శాఖలోనే... ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం అశోక్ గజపతి రాజుకు చేదు అనుభవం ఎదురైంది... ఎయిర్ ఇండియా విమానంలో, ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్ళేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు... అశోక్ గజపతి రాజు లగేజీని తనిఖీ చేసిన విమానాశ్రయ సిబ్బంది, దానిని అక్కడే వదిలేశారు... ఆయన విశాఖపట్నం చేరుకున్న తర్వాత తన లగేజ్ లేకపోవడం గమనించినట్లు తెలుస్తోంది... ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి...

ashok 10042018

అయితే, ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో జరగటంతో, ఇది కావాలని ఎమన్నా జరిగిందా ? కావాలనే ఆయన్ను అవమానపరచటానికి, ఇలాంటి సంఘటన ఏమన్నా జరిగిందా అనే సందేహాలు ఉన్నాయి... మొన్న ప్రధాని ఇంటి ముందు జరిగిన ధర్నా సందర్భంలో, అశోక్ గజపతి రాజు కూడా పాల్గున్నారు... ఆయన తల్లి అంత్యక్రియలు ముగిసిన రెండో రోజే, ఆందోళనలో పాల్గుని, కన్న తల్లి లాంటి రాష్ట్రానికి న్యాయం కోసం, ఆయన చేసిన పనికి ప్రజలు మన్ననలు పొందారు... ఈ నేపధ్యంలోనే, ఎవరన్నా పెద్దలు కక్షకట్టి, రాజు గారిని ఇలా అవమానపరిచారా అనే సందేహం కూడా కలుగుతుంది...

ashok 10042018

ఎందుకంటే, అయన ఇదే విమానయాన శాఖలో నెల రోజులు క్రిందటి దాకా మంత్రి, మరో పక్క ఇప్పటికీ ఒక ఎంపీ... ఇలాంటి విఐపిని, ఎయిర్ ఇండియా సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాసం ఉండదు... పోనీ ఆయనతో పాటు, మరికొంత మంది లగేజి కూడా ఆగిపోతే, పొరపాటు అనుకోవచ్చు... కాని, పని గట్టుకుని, అశోక్ గజపతి రాజు ఒక్కరి లగేజిని ఇలా చెయ్యటం చూస్తుంటే, ఆయన్ను ఘోరంగా అవమానించటం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకునే క్రమంలో, అశోక్ గజపతి రాజు గౌరవాన్ని భంగం కలిగించే చర్యలు కూడా తీసిపారియ్యలేము అని టిడిపి వర్గాలు అంటున్నాయి...

Advertisements