కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, సుప్రీం కోర్టులో వాదించే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‍, బీజేపీ నేత, న్యాయవాది అయిన అశ్వినీ ఉపాధ్యాయకు , జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పై సంచలన లేఖ రాసారు. ఆ లేఖలో స్పష్టంగా జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖ, అదే విధంగా ఆ లేఖను తరువాత మీడియాకు ఇచ్చి, బహిర్గతం చేయటం, కచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని తెలిపారు. అంతె కాకుండా, ఈ లేఖ బయటకు విడుదల చేసిన సమయం చూస్తే అనేక అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఉందని ఆయన లేఖలో తెలిపారు. సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, ఏదైతే ప్రజాప్రతినిధుల పై ఉన్నటు వంటి కేసులు పై త్వరతిగతిన విచారణ జరపాలి అంటూ, ఆదేశాలు జరీ చేసినటు వంటి నేపధ్యంలో, జగన్ ఈ లేఖ రాయటం, దాన్ని బహిర్గతం చేయటం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, 16.9.2020న ఈ యొక్క ప్రజా ప్రతినిధులకు సంబందించిన తీర్పు ఇస్తే, ఆ తరువాత 6.10.2020లో జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాయటం, ఆ తరువాత ఆయన ప్రధాన సలహాదారు అయిన అజయ్ కల్లం రెడ్డి, 10.10.2020లో ఈ లేఖను బహిర్గతం చేస్తూ విలేఖరుల సమావేశం పెట్టటం, ఇవన్నీ చూస్తుంటే, కచితంగా అనుమానాలకు దారి తీస్తున్నాయని అన్నారు.

attorney general 02112020 2

ప్రైమాఫసి కింద అంటే ప్రాధమిక ఆధారాల కింద చుస్తే, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని అన్నారు. అయినా కూడా ఇవన్నీ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా దృష్టిలో ఉన్నాయని, ఆయనకు కూడా ఈ లేఖ వచ్చింది, అలాగే మీడియాకు విడుదల చేసిన విషయం తెలుసు కాబట్టి, దీని పై నేను ప్రత్యేకంగా కోర్టు ధిక్కారణ కింద కేసు పెట్టాలని అనుమతి ఇవ్వాల్సిన పని లేదు అంటూ ఈ లేఖలో స్పష్టం చేసారు. అశ్వినీ ఉపాధ్యాయ అనే వ్యక్తి , బీజేపీ నేత సీనియర్ లాయర్. ప్రజాప్రతినిధులలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల పై ఆయన గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. ఆయనే జగన్ రాసిన లేఖ, దాన్ని బహిరంగ పరచటం పై, కోర్టు ధిక్కారణ కింద కేసు నమోదు చేయటానికి అనుమతి ఇవ్వాలి అంటూ, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‍కు గతంలో లేఖ రాసారు. ఆ లేఖకు , అటార్నీ జనరల్ స్పందించి, ఈ వ్యాఖ్యలు చేసారు. అలాగే ఈ లేఖలో జగన్ పై ఉన్న 31 కేసులు అంశాన్ని కూడా సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ ప్రస్తావించారు. సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ అంటే కేంద్రం తరుపున, సుప్రీంలో వాదిస్తారు. ఆయన కూడా, ఇలా రాయటం చూస్తుంటే, కేంద్రం కూడా ఈ విషయంలో, ఏమి చేయలేదనే సంకేతాలు వస్తున్నాయి.

Advertisements