ఈ రోజు రాజ్యసభ వాయిదా పడ్డా, సభలోనే టీడీపీ ఎంపీలు ఉండి ఆందోళన చేస్తున్నారు... టీడీపీ ఎంపీలు సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి రాజ్యసభలోనే కూర్చోని విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలతో హోరెత్తించారు... సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై చర్చ చేపట్టాలని ఆందోళన చేసారు...నినాదాలు చేస్తున్న ఎంపీలను బయటికి తీసుకెళ్లేందుకు మార్షల్స్‌ యత్నించారు. ఈ క్రమంలో మార్షల్స్‌తో టీడీపీ ఎంపీల వాగ్వాదానికి దిగారు.

tdp mp 05042018 2

ఇదిలా ఉంటే.. వీరికి మద్దతుగా, పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో టీడీపీ లోక్‌సభ సభ్యులు ధర్నా చేపట్టారు. ఎంపీ అవంతి శ్రీనివాస్‌ కుప్పకూలిపోయారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆందోళన కొనసాగిస్తుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పి లక్షణాలు కూడా కనపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత వైద్యులు వచ్చి ఆయన్ను పరీక్షించారు. బీపీ కారణంగా అవంతి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

tdp mp 05042018 3

మరో పక్క రాజ్యసభలో, ఆందోళన విరమించాలని టీడీపీ ఎంపీలను కోరిన డిప్యూటీ చైర్మన్ కురియన్‌, కేంద్ర మంత్రి విజయగోయల్‌ పలుమార్లు కోరినా..వాళ్లు మాత్రం ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. సభలో బైఠాయించిన టీడీపీ ఎంపీలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. టీడీపీ ఎంపీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు మీడియాకు వివరించారు. మరోవైపు, రాజ్యసభలో బైఠాయించిన టీడీపీ సభ్యులతో రాజ్యసభ సెక్రెటరీ జనరల్ చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ కూడా చర్చలు జరిపారు...

Advertisements