శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్నటినిన్న ఒక దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడని, ధూళిపాళ్ల నరేంద్ర, వారి తండ్రిగారైన వీరయ్యచౌదరి గురించి గుంటూరుజిల్లా వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, గౌరవప్రదమైన కుటుంబనుంచి వచ్చి, ప్రజాభిమానంతో 5సార్లు ఎమ్మల్యేగా గెలిచిన వ్యక్తిని తెల్లవారుజామున ఏసీబీ వారు ఇంటికెళ్లి దారుణంగా అరెస్ట్ చేయడం దారుణాతి దారుణమని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరోసభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విలేకరులకు అందచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "ధూళిపాళ్ల నరేంద్ర వంటి పెద్దనాయకులను అరెస్ట్ చేసే ముందు, తగినఆధారాలు చూపి, నోటీసులిచ్చి, తరువాత చర్యలకుఉపక్రమించాలి. ఏ ఆధారాలు లేకుండా, నోటీసులు ఇవ్వకుండా టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్లు నరేంద్రను అరెస్ట్ చేశారు. ఇంటిలోని ఆడవాళ్లను బెదరించారు. నరేంద్రను అంత దారుణంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటీ దారుణం. ఒకపక్క కరోనాతో ప్రజలు చనిపోతున్నా శాడిస్ట్ ముఖ్యమంత్రికి ఏమీ పట్టడంలేదు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ దొరకడంలేదు. టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవు. కరోనా రోగుల గోడు పట్టించుకునే నాధుడే లేడు. ఇవేమీ పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని, ఎవరైతే తనను, తన ప్రభుత్వాన్ని, తన అవినీతిని ప్రశ్నిస్తున్నారో, వారిని లోపలేయాలని చూస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చింది. ఇదివరకు అచ్చెన్నాయుడును కూడా ఏతప్పూలేకపోయినా అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. కొల్లురవీంద్రనుకూడా అదేమాదిరి తప్పుడుకేసులతో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఇప్పుడు నరేంద్ర గారిని అదేవిధంగా అరెస్ట్ చేయించారు. మరోపక్క మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా నోటిసులిచ్చారు. ఈ ముఖ్యమంత్రే పెద్ద దొంగ, దోపిడీదారు. ఆయనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలంతా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వారిమీద చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి, ప్రతిపక్షపార్టీకి చెందినవారిపై తప్పుడుకేసులు పెడుతున్నాడు. ఈ ప్రభుత్వం నరేంద్రపై చేస్తున్న ఆరోపణలేమిటి? సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ లోకి మార్చడం తప్పని చెబుతున్నారు."

"సంగం డెయిరీ తరుపును ఒక ట్రస్ట్ ఏర్పాటుచేసి, ఆసుపత్రి నిర్మించి, పేదలకు, మధ్య తరగతివారికి ఉచితంగా, నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి నరేంద్ర ప్రయత్నించాడు. అదికూడా తప్పేనని ఈ ప్రభుత్వం అంటోంది. పక్కరాష్ట్రంలోని నల్గొండలో ఒక డెయిరీని, విశాఖపట్నంలోని విశాఖ డెయిరీని కూడా కంపెనీ యాక్ట్ పరిధిలోకి మార్చారు. అదికూడా తప్పేనా? అది ఒప్పు అయినప్పుడు సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ లోకి తీసుకురావడం కూడా ఒప్పే కదా? ఒక వేళ అది తప్పయితే, సంగండెయిరీ కంటే ముందే కంపెనీ యాక్ట్ లోకి వచ్చిన నల్గొండ డెయిరీ, విశాఖ డెయిరీల నిర్వాహాకులపై ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారినెందుకు అరెస్ట్ చేయించలేదు? విశాఖ డెయిరీ వారు వైసీపీవారు కాబట్టి, ముఖ్యమంత్రి వారిపైకి ఏసీబీవారిని పంపలేదా? తనపార్టీ వారు అయితే ఏంచేసినా పర్లేదా? లేకుంటే పార్టీలోకి వచ్చేటప్పుడు కోట్లాదిరూపాయలు కప్పం కడతారు కాబట్టి, వారిని ముఖ్యమంత్రి టచ్ చేయడా? విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేసినప్పుడు, భోజనాలు, టిఫిన్లు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్ల వంటివవన్నీ విశాఖ డెయిరీవారే పంచారు కాబట్టి, వారిపై చర్యలు లేవా? మంచీచెడూ లేకుండా శాడిస్ట్ ముఖ్యమంత్రికి ఎవరు కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటాడా? నరేంద్ర కుటుంబం ఏమిటి.. వారి పరపతి ఏమిటి... వారుచేసిన సేవలేంటి అనేది ఆలోచించరా? నిజంగా నరేంద్రగానీ, ఆయనకుటుంబంగానీ తప్పుచేస్తే ఏంచేశారో చెప్పాలికదా? దాన్ని నిరూపించాలి కదా.. ఆతరువాత కదా ఆయన్ని జైలుకు పంపాల్సింది. ఇవేవీ చేయకుండా రాత్రికి రాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయాల్సిన ఎమర్జన్సీ పరిస్థితి ఏమొచ్చింది. నరేంద్రచేసింది తప్పయితే , విశాఖ డెయిరీ నిర్వాహకులు చేసిందికూడా తప్పే కదా? ఏసీబీ వాళ్లకు నిజంగా మానవత్వముంటే, వారి విధినిర్వహణపై వారికి నమ్మకముంటే, విశాఖ డెయిరీ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలి."

"ఇవన్నీ మీడియావారికిచెప్పాను కాబట్టి, నాదేమైనా తప్పుంటే నాకు సమాధానం ఇవ్వండి. దానిలో తప్పులేదు. నేను ఇప్పుడుచెప్పింది తప్పయితే సరిదిద్దుకుంటాను. ఏసీబీవారికి, సీఐడీవారికి, పోలీసులకు ఒక విషయం చెప్పాలి. నా చిన్నతనంలో పోలీస్ శాఖ, అనుబంధ శాఖలను చూస్తే ఎవరైనా గర్వంగా ఫీలయ్యేవారు. న్యాయంచేస్తారని నమ్మేవారు. కానీ ఇప్పుడుచూస్తుంటే, ఇంతలా దిగజారిపోయారేంటి అనిపిస్తోంది. స్వతంత్ర సంస్థలైన ఏసీబీ, సీఐడీ, పోలీస్ శాఖలు ఒక దొంగ జేబులో దూరిపనిచేస్తున్నాయి. సీఐడీ అధికారుల పనితీరుగురించి గతంలో సినిమాల్లో చాలా గొప్పగా చూపేవారు. ఇప్పుడు రాజకీయ నేతలుఏంచెప్తే వారి ఇళ్లపైకి వెళ్లడం, ముఖ్యమంత్రి చెప్పినవారిని అరెస్ట్ చేయడం చేస్తారా? అధికారులు, లేదా నాయకలు అవినీతికి పాల్పడితే, లంచాలు తీసుకుంటే, ప్రజలు వారిపై ఫిర్యాదుచేశాక, సీఐడీ, ఏసీబీ విభాగాలు స్పందించేవి. కానీ ఇప్పుడలా లేదు. ముఖ్యమంత్రి చెప్పడమే ఆలస్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ డెయిరీ, విశాఖ డెయిరీలపై తాముకూడా ఫిర్యాదుచేస్తాము.. ఏసీబీ వారు చర్యలు తీసుకుంటారా? లేక ముఖ్యమంత్రి అనుమతికోసం ఎదురు చూస్తారా? ఏంటండీ ఇది.. వ్యవస్థలు ఇలా దిగజారిపోతే, సామాన్యుడు న్యాయం కోసం ఎవరిదగ్గరకు వెళ్లాలి. పోలీస్ శాఖ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏపీ పోలీస్ అంటే దేశమంతా అసహ్యించుకుంటోంది. ఒక దొంగోడు చెప్పినట్టు నడుచుకుంటూ, దొంగఓటర్లను అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఏసీబీ, సీఐడీ విభాగాలు స్వతంత్ర సంస్థలని, ఆయా విభాగాల అధిపతులు గుర్తిస్తే మంచిది. ఉన్నతమైనస్థానాల్లో ఉన్న అధికారులు ప్రజల్లో మీపై ఉన్న నమ్మకాన్ని పోగోట్టుకోవద్దని విజ్ఞప్తిచేస్తున్నాను. ఎవరు తప్పుచేసినా అరెస్ట్ చేయండి...కానీ ఆధారాలతో సహానిరూపించండి. రాజకీయ నాయకుల ఒత్తిడితోనో, శాడిస్ట్, తుగ్లక్ ముఖ్యమంత్రి ఆదేశాలతోనో పనిచేయకండి. ఎవరినైనా జైల్లో పెట్టి అద్దంలో చూసుకొని నవ్వుకోవడం ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రికి అలవాటు. ఆ విషయం ఏసీబీ, సీఐడీ అధికారులు గ్రహించాలని కోరుతున్నాను."

Advertisements