తాడేపల్లిలోని విలాసవంతమైన రాజభవనంలో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి 15లక్షలమంది అమాయకులైన విద్యార్థులజీవితాలతో, తనస్వార్థ రాజకీయాలకోసం చెలగాటమాడుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. క-రో-నా రెండోదశ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో దేశంలోని 11రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వం వివిధరకాల పరీక్షలను వాయిదావేస్తే, ఈ దిక్కుమాలిన ముఖ్యమం త్రి 15లక్షలమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా డుతున్నాడని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 30లక్షల కుటుంబాల్లో తీరని శోకం నింపడమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడన్నారు. రోజూ కొన్ని వందలమంది క-రో-నా-తో చనిపోతుంటే, కొన్ని లక్షల కుటుంబాలు భయాందోళనతో ఉంటే, అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఆటలాడేహక్కు ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని సత్యనారాయణమూర్తి నిలదీశారు. నారాలోకేశ్ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో చర్చించిన తర్వాత పరీక్షలువాయిదా వేయాలని ముఖ్యమంత్రిని కోరితే, కళ్లు నెత్తికెక్కిన అహంకారంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడన్నా రు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలు వాయిదా వేయాలనికోరుతోంటే, ఎంతసేపూ అక్రమార్జన గురించి, అవినీతి, దోపిడీలగురించి ఆలోచించే ముఖ్యమంత్రికి విద్యార్థినీ, విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందన్నారు. విద్యాదీవెన అంటూ విద్యార్థులను క-రో-నా-కి బలిచేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనా అని మాజీమంత్రి నిలదీశారు. తనకుమార్తెలను విదేశాల్లో చదివిస్తూ, వారిగురించి అన్నిరకాలుగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని పసిమొగ్గల గురించి ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. మంత్రి ఆది మూలపు సురేశ్ మూర్ఖుడిలా మాట్లాడుతున్నాడని, భావితరాలపై ఎందుకింతలా కక్ష కట్టారో మంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బండారు డిమాండ్ చేశారు.

భూములమ్మితే ఎంతొస్తాయి... వేంకటేశ్వరస్వామి సంపదను ఎలా కొల్లగొట్టాలి... ప్రజలపై అధికంగా పన్నులభారంవేసి ఎలా దోచేయా లనే ఆలోచనలు తప్ప, ఈ ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టడంలేదన్నారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలనుబాధిస్తున్నాయా.. వారికి మేలుచేస్తున్నాయా అనేదానిపై ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచనచేయకపోతే ఎలాగని సత్యనారాయణమూ ర్తి నిలదీశారు. ముఖ్యమంత్రి చదువుకున్న మూర్ఖుడిలా, రాక్షసుడిలా వ్యవహరిస్తుంటే, బాధ్యతగల అధికారులు, మరీ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్ ఎందుకు స్పందించడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాల్సిరావడం ఆంధ్రా ప్రజలు చేసుకున్న పాపమని టీడీపీనేత వాపోయారు. 15లక్షల మంది విద్యార్థులకు ఏదైనా జరిగితే, వారి కుటుంబాలకు ఎవరు సమాధానంచెబుతారో ముఖ్య మంత్రి చెప్పాలన్నారు. రాష్ట్రంలో క-రో-నా కేసులు పెరుగు తున్నా... ఆక్సిజన్ కొరత, పడకలకొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నా, మరణాలు పెరుగుతున్నా ముఖ్యమంత్రికి అవేవీ పట్టడంలేదని సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించిందని, దాంతో మోదీ నేడు అత్యవసరసమీక్షా సమావేశం ఏర్పాటుచేశాడన్నారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలువేసినా ఈ ముఖ్యమంత్రికి మాత్రం సిగ్గుండదన్నారు. ప్రజలను, కోర్టులను, ప్రసార మాధ్య మాలను ఖాతరుచేయకుండా, మూర్ఖత్వంతో, డబ్బు పిచ్చితో, అధికారమదంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తు న్నాడని బండారు తేల్చిచెప్పారు. విద్యార్థులనే పసిమొ గ్గలు రాలిపోకుండా ముఖ్యమంత్రి వెంటనే పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్ చేసారు.

Advertisements