బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి... ఒక వైపు ఇప్పటికే మొదలైన పనులు, మరో ఏడె నిమిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు... ప్రస్తుతం ఆరు నెలలుగా పనులు జరుగుతున్నాయి. మరో తొమ్మిది నెలలు ఉంది. కానీ, ఏడు నెలల్లోనే అంటే ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి ఫ్లైఓవర్‌ను అప్పగిస్తామని కాంట్రాక్టు సంస్థ ఎన్‌హెచ్‌ అధికారులకు చెబుతోంది. అయితే, రెండో వైపు పై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకు టెండర్లను పిలవలేదు. రెండో పార్టు పైవంతెనకు సంబంధించిన అంచనాలను పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) ఆర్థిక అనుమతుల కోసం ఆశాఖకు పంపినట్లు తెలిసింది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) కేంద్రానికి సమర్పించి రెండునెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆమోదంగానీ, టెండర్లుగానీ పిలవలేదు. జాప్యం జరిగితే అంచనా వ్యయం మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది.

benzcircle 14042018

ఇప్పటికే రూ.25 కోట్లమేర వ్యయం పెరిగింది. జాప్యం జరిగితే అంచనా వ్యయం మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ రెండో వరస ప్రతిపాదన ఇంకా స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ (ఎస్‌ఎఫ్‌సీ) వద్దే ఉంది. ఎస్‌ఎఫ్‌సీ ఆమోదంతోనే టెండర్లకు అవకాశం ఉంటుంది. డీపీఆర్‌ ఆమోదంలో జాప్యం వల్లే సమస్య తలెత్తుతోంది. 16 నెంబర్‌ జాతీయ రహదారిపై బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను ఐకానిక్‌లా రూపొందించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్‌బెల్ట్‌ల స్థానంలో రెండు వరసల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు డిజైన్లను రూపొందించి కేంద్రం అనుమతులు తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకముందే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ టెండర్లు పిలిచింది. రెండువరసల విధానంలో నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో, రెండో వరసకు ప్రత్యేకంగా టెండర్లు చేపట్టాలని నిర్ణయించారు.

benzcircle 14042018

దీంతో మొదటి వరస పనులను కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ చేపట్టింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి మొదటివరస పనులను పూర్తిచేయాల్సి ఉంది. ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. నెలలోగా రెండో వరస పనులు కూడా ప్రారంభించాల్సిన తరుణంలో.. డీపీఆర్‌లో జాప్యం జరిగింది. మొదటి వరసను రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించగా.. రెండో వరసకు డీపీఆర్‌ రూపొందిస్తే రూ.110కోట్ల వ్యయం అయింది. ఈ కొద్ది సమయానికే రూ.25 కోట్లు పెరిగింది. మొదటి వరసను మరో ఎనిమిది నెలల్లో కాంట్రాక్టు సంస్థ పూర్తిచేయాల్సి ఉంది. ఇంకా రెండోవరస పట్టాలెక్కకపోతే మున్ముందు మరింత సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే బెంజిసర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగాయి. కేంద్రం, ఇప్పుడప్పుడే రెండో వరుసకు, అనుమతులు ఇచ్చే పరిస్థిది కనిపించటం లేదు... ఇది కూడా దుర్గగుడి ఫ్లై ఓవర్ లాగా, అటు రాష్ట్రానికి ఇవ్వక, కేంద్రం డబ్బులు ఇవ్వక, చంద్రబాబు పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి...

Advertisements