అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ నేపధ్యంలో, రాష్ట్రపతి భవన్ లో నిన్న సాయంత్రం రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ విందుకు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అనింది. అయితే దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాత్రం ఆహ్వానం అందలేదు. అయితే జగన్ కు ఆహ్వానం అందకపోవడం పై పలు విమర్శలు వచ్చాయి. జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టే, ఆయనకు ఆహ్వానం లేదు అంటూ, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్​కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడు కాబట్టే విందుకు ఆహ్వానించలేదని అన్నారు. జగన్ ఎంతో బలమైన నాయకుడు కాబట్టే ఆహ్వానం పంపించి ఉండక పోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు బొత్సా.

botsa 26022020 2

నిన్న చంద్రబాబు ఈ మధ్య ఈ విషయం పై మాట్లాడుతూ, ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం అంది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందకపోవడం అవమానకరమని టిడిపి మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆర్థిక నేరగాడైన జగన్​ను ఆహ్వానిస్తే.. తనకు చెడ్డ పేరు వస్తుందనే ప్రధాని మోదీ.. డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్​ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు తెనాలి పక్కనున్న పెదరావూరు మహిళలకూ ఆయన పక్కన కూర్చునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు.

botsa 26022020 3

చట్టాలు చేసే స్థానాల్లో ఉన్న వారే, ఆయా చట్టాలపై నమ్మకం లేదన్నట్లుగా మాట్లాడే నేతల తీరుచూస్తుంటే, ఇలాంటివాళ్లకా మనం ఓట్లేసిందని ప్రజలంతా సిగ్గుపడుతున్నారన్నారు. 11 సీబీఐ ఛార్జ్ షీట్లలో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్, రూ.43వేలకోట్ల అక్రమఆస్తులను జప్తు చేయించుకొని, దేశవ్యాప్తంగా అవినీతి చక్రవర్తిగా పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ వేయడం చూస్తుంటే హస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయస్థానాలకు హాజరుకాకుండా, వారంవారం తప్పించుకు తిరుగుతున్న జగన్, ప్రజలను మభ్యపెట్టడానికే ఇటువంటి చిల్లర పనులు చేస్తున్నాడని ఆలపాటి దుయ్యబట్టారు. గత ప్రభుత్వ పాలనపై విచారణ జరుపుతానంటున్న జగన్, ప్రభుత్వంలోని శాఖలన్నింటినీ విచారణ పరిధిలోకి తీసుకురావడం ద్వారా, ఎందరు అధికారులను, ఎన్నేళ్లపాటు విచారిస్తాడో సమాధానం చెప్పాలన్నారు. సెర్బియా అరెస్ట్ కాబడిన నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్, భారతిసిమెంట్స్ లోకి, ఇతరేతర కంపెనీలద్వారా, తప్పుడు మార్గాల్లో ఎలా సంపాదించారో దానిపై జగన్ నోరు విప్పితే బాగుంటుందని ఆలపాటి ఎద్దేవాచేశారు. తనపై ఉన్న కేసులగురించి, తన అవినీతి చరిత్ర గురించి ప్రజలకు చెప్పి, కోర్టులకుహాజరై తాను దొంగో, దొరో జగన్ నిరూపించుకుంటే మంచిదన్నారు.

Advertisements