కర్నూలు లోక్‌సభ సెగ్మెంట్‌ అనగానే గుర్తుకొచ్చేది కొండారెడ్డి బురుజు. 1952లో కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం దివంగత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎంపీగా ఎన్నికై కేంద్రంలో పలు మంత్రి పదవులు చేపట్టారు. 2009లో పునర్విభజన తర్వాత మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా చేరింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అధినేతలు బీసీలకే టికెట్‌ ఇచ్చారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడును టీడీపీ బరిలో దింపితే, చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను వైసీపీ పోటీలో పెట్టింది. ఈ ఎన్నికల్లో బుట్టా రేణుక విజయం సాధించారు.

aadala 16032019

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఆమె వైసీపీనీ వీడి టీడీపీలో చేరడం జరిగింది.. ఈసారి కూడా ఆమెకే టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. పార్టీలో చేరే సమయంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనకు రెండు ఎమ్మెల్యే సీట్లు, కర్నూలు పార్లమెంట్ స్థానం కావాలని చంద్రబాబును కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉండటం, సీనియర్ నేత కావడంతో.. కర్నూల్ ఎంపీ టిక్కెట్ కోట్ల సూర్య ప్రకాశ్‌కే కేటాయించారు. కర్నూల్ ఎంపీ స్థానం బదులు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం కేటాయిస్తానని చంద్రబాబు.. బుట్టాకు చెప్పగా దానికి ఆమె ఒప్పుకోలేదు.

aadala 16032019

చివరికి ఆమె పార్టీ మారీ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ అయినా తనకు టిక్కెట్ ఇస్తుందని ఆమె ఆశపడ్డారు.. కానీ జగన్ కూడా ఆమెకు టిక్కెట్ కేటాయించలేదు. వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి బీవై రామయ్య, ఆయుష్మాన్‌ ఆసుపత్రి డాక్టర్‌ సంజీవ్ కుమార్‌ టికెట్లు ఆశించారు. అధిష్టానం సంజీవ్ కుమార్‌కే టిక్కెట్ కేటాయించింది. కానీ కోట్లను సంజీవ్ కుమార్ ఎంత వరకు పోటీ ఇవ్వగలరో త్వరలో తేలనున్నది.

Advertisements