ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం దిల్లీ బాట పట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ పార్టీల నేతలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా సోమవారం రాత్రి దిల్లీకి వెళ్లిన సీఎం ఇవాళ సాయంత్రం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో చంద్రబాబు చెప్పిన ఒక విషయం మాత్రం నేషనల్ మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది... మళ్ళీ ఒకసారి చెప్పండి అంటూ, చంద్రబాబుని అడిగారు... దీని పై చంద్రబాబు మరో సారి స్పష్టం చేస్తూ, ఆధారాలు కూడా చూపించారు... ఆ విషయం ఏంటి అంటే..

cbn 04042018 1

ఫిబ్రవరి 4 నుంచి మా ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు... ఇలా డబ్బులు వేసి మరీ, వెనక్కు తీసుకోవటం ఎక్కడన్నా చూసారా ? ఇదిగోండి ఆధారాలు అంటూ, ఎకౌంటు లో డబ్బులు పడిన ఎంట్రీ, వెంటనే డబ్బులు వెనక్కు తీసుకున్న ఎంట్రీ కాపీలు చూపించారు... ఈ విషయం తెలుసుకున్న విలేకరులు ఆశ్చర్యపోయారు...

cbn 04042018 1

ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... వీరి కక్ష ఇలా ఉంటుంది... నాలుగేళ్ల ముందు చంద్రబాబు బయటకు వచ్చి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి... పోలవరం అసలు మొదలే అయ్యేది కాదు... అమరావతికి ఎన్నో ఇబ్బందులు వచ్చేవి (పర్మిషన్ల గురించి)... నాలుగేళ్లు అయ్యాకనే మనకివ్వాల్సింది మనం అడిగితే ఇంత పెడసరిగా వెళుతున్న వారు తొలిరోజు నుంచే చంద్రబాబు దూకుడుగా వెళ్లివుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది.

Advertisements