కర్ణాటకలో రెండో విడత జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 19న రాయచూరుకు రానున్నారు. మార్గమధ్యంలో కర్నూలు జిల్లాలో ఆయన ఆగనున్నారు. ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ లో జిల్లా టీడీపీ నేతలతో ఆయన భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కర్నూలులో పార్టీ పరిస్థితి గురించి, గెలుపు అవకాశాలపై మాట్లాడనున్న్టట్లు పార్టీ వర్గాల సమాచారం. అనంతరం, రాయచూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు వెళతారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంయుక్త అభ్యర్థి బీవీ నాయక్‌ తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. రాయచూరు, కొప్పళ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వేలాదిమంది తెలుగువారు నివసిస్తున్నారు.

kurnool 18042019

కాంగ్రె్‌స-జేడీఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని వారందరికీ చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. ఈ సందర్భంగా రాయచూరు అభ్యర్థి తరఫున రాహుల్‌గాంధీ, చంద్రబాబు ఒకే వేదికపై నుంచి ప్రచారం చేయనున్నారు. తొలివిడతలో జేడీఎ్‌స-కాంగ్రెస్‌ సంయుక్త అభ్యర్థి నిఖిల్‌కుమారస్వామి తరఫున మండ్యలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, కర్ణాటకలో రాహుల్‌తో కలసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే ప్రథమం. బీజేపీ వ్యతిరేక పక్షాల నేతలను పనిగట్టుకుని వేధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘‘నేను మొన్న కర్ణాటక వెళ్లాను. ఆ వెంటనే జేడీఎస్‌ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న చెన్నై వెళ్ళాను. తిరిగి రాగానే డీఎంకే నేత కనిమొళి ఇంటిపై దాడి చేశారు. బీజేపీ నేతలు, ప్రధాని మోదీ సన్నిహితులపై ఎందుకు ఈ దాడులు జరగవు?

kurnool 18042019

ఒడిసా, బెంగాల్‌ ముఖ్యమంత్రులు నవీన్‌, మమతలను రకరకాలుగా వేధిస్తున్నారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రుల హెలికాప్టర్లను ఐటీ శాఖ అధికారులు ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా బీజేపీ ముఖ్యమంత్రుల హెలికాప్టర్లు తనిఖీ చేశారా’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. విపక్ష నేతల ప్రచారానికి ఒక్క హెలికాప్టర్‌, విమానం కూడా దొరక్కుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ‘‘ఎక్కడైనా ఒకటీ అరా సంపాదిస్తే ఏవియేషన్‌ డైరెక్టర్‌కు చెప్పి వాటిని వెంటనే దింపివేసి మళ్లీ ఎగరకుండా చూస్తున్నారు. బీజేపీకే అన్ని వసతులూ ఉండాలా? ప్రతిపక్షాలకు ఉండకూడదా?’’ అని ప్రశ్నించారు.

Advertisements