ఏపీలో ఈసారి రెండు ఫ్యాన్ లు వస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి టీడీపీ, ప్రజాశాంతి పార్టీ మధ్యే పోటీ ఉంటుందన్న కేఏ పాల్ వ్యాఖ్యలను ఓ విలేకరి ఈ సందర్భంగా ప్రస్తావించగా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలతో అందరినీ నవ్వించారు. జగన్ ఫ్యాన్ కంటే హెలికాప్టర్ ఫ్యానే పవర్ ఫుల్ అంటూ వ్యాఖ్యానించారు. "జగన్ మోహన్ రెడ్డి గింజుకుంటున్నాడు. అది కూడా ఫ్యానే, నాది కూడా ఫ్యానే అని తెగ బాధపడిపోతున్నాడు. డెఫినెట్ గా పవర్ ఫుల్ ఫ్యాన్ వచ్చేసి హెలికాప్టర్ ఫ్యానే. జగన్ ఫ్యాన్ కు రేంజ్ తక్కువ. ఆ ఫ్యాన్ కు పెద్ద రేంజ్ ఉంటుంది" అంటూ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు.

thota 29102018 1

ప్రతిపక్ష నేత జగన్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ జీవితం అడ్డదారి, వైసీపీది చెడుదారి అని వివరించారు. చట్టంలో ఎన్ని నేరాలు ఉన్నాయో జగన్‌ అన్నీ చేశారన్నారు. జగన్‌ ఇప్పటి వరకు ఆర్థిక నేరాలే చేశారని, కానీ ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త నేరాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి దివాళాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ డేటా దొంగిలించడానికి ప్రయత్నించి జగన్‌ అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. ఒక ప్లాన్‌ ప్రకారం పాయింట్ల వారీగా రాసుకుని మరీ టీడీపీపై కుట్ర చేశారన్నారు. ఈసీకి విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖలో వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు.

thota 29102018 1

వైసీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి ఈ డ్రామా నడిపారని తెలిపారు. ఇంతకు ముందు కూడా పంటలు తగలబెట్టడం లాంటి అరాచకాలు చాలా చేశారని గుర్తుచేశారు. నేరాలు చేయడంలో గ్రాండ్‌ మాస్టర్‌ అంటూ జగన్‌ను చంద్రబాబు విమర్శించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, పేదరికం తొలగింపుపై తాను వినూత్న ఆలోచనలు చేసి అమలు చేస్తుండగా... నేరాలు వినూత్నంగా ఎలా చేయాలన్నది జగన్‌ ఆలోచిస్తుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘‘నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే హామీ ఇచ్చా. మీ భవిష్యత్తు-నా బాధ్యత అని చెప్పాను. కానీ, జగన్‌ నినాదం... నా భవిష్యత్తు- మీ బాధ్యత. జైలుకు పోవడం జగన్‌ భవిష్యత్తు. దాన్నుంచి తప్పించడం ప్రజల బాధ్యత అంటారు’’ అని విమర్శించారు.

Advertisements