మూడు రాజధానుల పై, ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం పై, ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా, చంద్రబాబు పరోక్షంగా స్పీకర్ పై చంద్రబాబు చురకలు అంటించారు. పలు సందర్భాల్లో స్పీకర్ తమ్మినేని, తమ ప్రాంతం శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం అని, తమకు అన్యాయం చెయ్యవద్దు అంటూ చెప్పిన విషయం పై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఈ రాష్ట్రంలో, ఇక్కడ చాలా మంది మేము వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చాం అంటూ చెప్పుకుంటూ ఉంటారని, అన్ని సార్లు ఆ ప్రాంతం నుంచి వచ్చి, ఆ ప్రాంతానికి ఏమి చేసారు అంటే, వారి దగ్గర ఏ సమాధానం ఉండదని చంద్రబాబు అన్నారు. ఇది స్పీకర్ మాటి మాటికీ చెప్పే మాటలకు, చంద్రబాబు పరోక్షంగా ఇచ్చిన కౌంటర్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపుగా తమ్మినేని ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.

tammineni 20012020 2

ఇక శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో ఎక్కడా మూడు రాజధానులు గురించి చెప్పలేదని చంద్రబాబు అన్నారు. ఆ కమిటీ విజయవాడ-గుంటూరు ప్రాంతంపై మొగ్గు చూపిందన్నారు. ఆ తర్వాత విశాఖ ప్రాంతం వైపు మొగ్గిందన్నారు. రాజధానిగా విజయవాడ ఉండకూడదని కమిటీ ఎక్కడా చెప్పలేదని, వైకాపా నేతలు అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే వరదలు వస్తాయి , ఈ ప్రాంతం మునిగిపోతుంది అంటూ తప్పుడు ప్రచారం చేసి కేసులు వేసరాని, అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇక్కడ వరదలు రావు, ఈ ప్రాంతం మునగదు అంటూ, స్పష్టంగా తీర్పు ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోని పలు రిపోర్ట్ లో ఉన్న, తీర్పును చంద్రబాబు చదివి వినిపించారు.

tammineni 20012020 3

చంద్రబాబు పై పలువురు చేసిన విమర్శల పై ఆయన స్పందిస్తూ, ‘‘సభలో నన్ను విమర్శించేందుకే సమయం కేటాయించారు. నన్ను విమర్శించినా, ఎగతాళి చేసినా పరవాలేదు. వైసీపీ నేతలు మాట్లాడిన ప్రతీది ప్రజలు గమనిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. ఒక రాష్ట్రం... ఒకే రాజధాని మా సిద్ధాంతం. నన్ను వ్యక్తిగతంగా తిట్టడానికి సభ్యులు పోటీపడ్డారు. మూడు రాజధానులపై ప్రభుత్వ విధానం చెబితే బాగుండేది. విభజనచట్టంలో ఒకే రాజధాని అని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులని విభజన చట్టంలో చెప్పలేదు.’’ అని చంద్రబాబు అన్నారు.

Advertisements