కృష్ణా వరదల్లో, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా జిల్లలో, ఎన్నో ఊళ్ళు మునిగాయి. ఇళ్ళు, పంట పొలాలు నాశనం అయ్యాయి. అయితే ఈ వరదలు ముంచెత్తటం పై ప్రభుత్వ అసమర్ధత ఉండనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు, దాదపుగా జూలై 20 ఆ టైంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, వరదలు అధికంగా ఉంటాయి, కృష్ణా ప్రవాహం అధికంగా ఉంటుంది అంటూ, హెచ్చరించాయి. జూలై 31న శ్రీశైలంకు వరద పోటెత్తింది. అవుట్ ఫ్లో మొదలైంది. ఆగష్టు 3న శ్రీశైలం 854 టచ్ అయినా, పోతిరెడ్డి పాడుకు నీళ్ళు వదలలేదు. 6వ తేదీకి నీటిమట్టం 866.10 అడుగులకు చేరింది. ఇంకా ఎందుకు విడుదల చెయ్యలేదు అని రాయలసీమ రైతులు ఆందోళనకు సిద్దం అవుతున్నారని తెలిసి, ఎట్టకేలకు గేట్లెత్తి 6వ తేదీ 2 వేల క్యూసెక్కులను, 7వ తేదీన దీనిని 5వేల క్యూసెక్కులు మాత్రమే వదిలారు. తరువాత 15 వేలకు పెంచారు. 16వ తారీఖు నుంచి మాత్రమే 40 వేల క్యూసెక్కులు వదిలారు.

cbvn 230820198 2

కాని పూర్తిస్థాయి సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు. అంటే ఆగష్టు 5 నుంచి, ఆగష్టు 16 దాకా, పోతిరెడ్డిపాడు నుంచి, పూర్తీ స్థాయిలో రాయలసీమాకు నీళ్ళు వదలలేదు. ఇక హంద్రీ నీవా ప్రధాన ఎత్తిపోతల అయిన మాల్యాల నుంచి 835 అడుగుల లెవెల్‌లో నీటిని తోడే అవకాశమున్నా, ఈనెల 5న 860.90 అడుగుల వద్ద 2 పంపులు ఆన్‌ చేసి 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. నిజానికి.. 2500 క్యూసెక్కులను తోడవచ్చు. ఈ వరదలు సడన్ గా వచ్చినవి కావు. 15 రోజుల నుంచి సరైన వాటర్ మ్యానేజ్మెంట్ చేస్తే, రాయలసీమకు మరో 30 టిఎంసీ దాకా నీరు తీసుకువెళ్ళే అవకాసం ఉండేది. ప్రకాశం బ్యారేజీ కింద లంకలు కూడా మునిగేవి కాదు. ఇంత పెద్ద వరద వచ్చినా, రాయలసీమకు కేవలం 26.35 టీఎంసీలు మాత్రమే ఆగష్టు 17 వరకు తీసుకు వెళ్లారు.

cbvn 230820198 3

శ్రీశైలం జలాశయం నుంచి ఒక్క కర్నూలులోని ప్రాజెక్టుల్లోనే 42.8 టీఎంసీలను నింపే అవకాశముంది. కడప, అనంతపురంలో రిజర్వాయర్లు కలిపితే 85 టీఎంసీ లు నిల్వ చేయవచ్చు. సోమశిల దీనికి అదనం. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తుంది. కేవలం అమరవతి టార్గెట్ గా, అటు రాయలసీమకు నీళ్ళు మళ్ళించక, ఇటు సముద్రంలోకి ఒకేసారి వదిలి, లంకలు ముంచారని ఆరోపిస్తుంది. అందుకే ఈ విషయం పై ప్రజలకు చెప్పటానికి, ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్నిందనే అంశంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ రోజు, రేపట్లో చంద్రబాబు ఈ అంశం పై పూర్తీ వివరాలతో ప్రజల ముందుకు వచ్చి, వివరించనున్నారు.

Advertisements