తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మద్దతు తీసుకుంటే తప్పేంటని జగన్‌ మాట్లాడుతున్నారని, వెయ్యి కోట్లు తీసుకున్నట్లు మీరు చూశారా అని జగన్‌ మాట్లాడుతున్నారని, ఆంధ్రావాళ్లు దొంగలు అన్న కేసీఆర్‌తో జగన్‌ ఎలా కలుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ పదేళ్లు హైదరాబాద్‌లో ఉంటే అనాథలుగా ఉండేవాళ్లమని ఆయన అన్నారు. "తెలంగాణ నుంచి లక్ష కోట్ల ఆస్తులు రావాలి.. వాటా ఇవ్వలేదు. కేంద్రం కూడా మనకు అన్యాయం చేసింది. జనాభా ప్రకారం ఆస్తులు ఇవ్వాలని సుప్రీం కూడా చెప్పింది. విభజన హామీలు ఇంకా నెరవేరలేదు... ప్రత్యేక హోదా రాలేదు. కేసీఆర్‌ డబ్బులకు కక్కుర్తి పడి జగన్‌ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. జగన్‌ కేసులకు భయపడి సరెండర్ అయ్యారు. "

cbn 26032019

"రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేలా రాజకీయాలు చేస్తే ఖబడ్దార్‌. ఏపీపై కేసీఆర్‌ పెత్తనాన్ని ఒప్పుకుంటారా?. రాష్ట్రంలో కరువు, తుఫాన్లు సమస్య కాదు.. కోడికత్తి పార్టీనే సమస్య. కేసీఆర్‌కు జగన్‌ దాసోహం. ఆయనతో కలిస్తే తప్పేంటి ఇప్పుడే అన్నారు. కేసీఆర్‌ ఎందుకు పోలవరంపై సుప్రీంకు వెళ్లాడు. దీనిపై జగన్‌ సమాధానం చెప్పాలి. కేసీఆర్‌ను జగన్‌ సపోర్ట్ చేస్తుంటే మీకు కోపం రాదా? రక్తం ఉడికిపోతోంది. జగన్‌...హైదరాబాద్‌ వెళ్లి లోటస్‌పాండ్‌లో ఉండు. తెలంగాణలో పోటీ చెయ్‌.. కేసీఆర్‌ దగ్గర మంత్రిగా ఉండు. ఆంధ్రా ప్రజలు దేశంలో పౌరులు కాదా.. మనకు రోషం లేదా?. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఏపీలో వచ్చి పోటీ చేయాలి. "

cbn 26032019

"సాగర్‌ నుంచి మనకు రావాల్సి నీళ్లు రానివ్వడం లేదు. ఆంధ్రా ప్రజలు జగన్‌ను క్షమించరు. ప్రాణాలైన పొగొట్టుకుంటాం కానీ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టం. తెలుగుజాతి ఎవరి దగ్గర భిక్షం ఎత్తాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ఆటలు సాగనివ్వం. రాజధానికి మోదీ ఇచ్చింది 1500 కోట్లు. రైతులు 50 వేల కోట్ల విలువైన భూములు ఇచ్చారు. కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలు..సానుభూతి మాకు అక్కర్లేదు. కేసీఆర్‌..రాజధాని శంకుస్థాపనకు వచ్చి 500 కోట్లు ఇవ్వాలనుకున్నాడట. మీ ముష్టి అక్కర్లేదు.. మాకు రావాల్సిన లక్ష కోట్లు ఇవ్వండి. ’’ అని అన్నారు. ఆంధ్రా వాళ్లు తనకి ఊడిగం చేయాలి అన్న రీతిలో కేసీఆర్ కుట్రలు పన్నుతుంటే సహించొద్దని అన్నారు. అలాంటి వ్యక్తితో కలిస్తే తప్పేంటి అని జగన్ అంటున్నాడంటే.. అతడి వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. అవకాశం, వితండవాదంతో జగన్ తన బలహీనతలన్నింటినీ బహిర్గతం చేసుకుంటున్నాడని విమర్శించారు.

Advertisements