తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకల పై, ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఆయన గాంధీ విగ్రహం ముందు కూర్చుని నిరసన తెలపటానికి సిద్ధం అయ్యారు. అదే విధంగా తిరుపతిలని 43వ డివిజన్ లో టిడిపి తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి టీ కొట్టు పడగొట్టటంతో, అక్కడకు కూడా వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే అనూహ్యంగా, చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. దీని వాళ్ళు చెప్తున్న కారణం ఎన్నికల నిబంధనలు, కరోనా నిబంధనలతో పాటుగా మొత్తం ఆరు కారణాలు. అయితే తిరుపతిలో రోజు 50 వేల మంది వచ్చి పోతూ ఉంటారని, అలాంటిది ఇప్పుడు నేను ఒక్కడినే వస్తే వచ్చిందా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసన చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లోనే నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకోవటంతో చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లో నేల పై కూర్చుని నిరసన తెలిపారు. అయితే ఈ సందర్భంలో పోలీసులు చంద్రబాబుని చుట్టు ముట్టి, బ్రతిమిలాడుతూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. పోలీసులు బ్రతిమిలాడుతూ అర్ధం చేసుకోండి అనే విధంగా, వాళ్ళ హావభావాలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, పోలీసులు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అని వాపోతున్నారు.

అయితే ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబుని బ్రతిమిలాడుతూ, సార్ మీరు పెద్ద వాళ్ళు, ఇక్కడ ఇలా కూర్చోవద్దు, పక్కకు వచ్చి కూర్చోండి అని చెప్పగా, నేనేమీ పెద్ద వాడిని కాదులే, మీరు నాకు ఇస్తున్న గౌరవం చాలా బాగుంది అని అన్నారు. నేను కలెక్టర్, ఎస్పీని కలవాలి అని చెప్పగా, వాళ్ళే ఇక్కడకు వస్తారు అని పోలీసులు బదులు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు నేనే వెళ్తాను, మీడియాతో మాట్లడతాను అని చెప్పగా, పోలీసులు బదులు ఇస్తూ, వాళ్ళే ఇక్కడకు వస్తారు సర్, ఇది మీ పై హానర్ అని చెప్పారు. నాకు ఏమి హానర్ అవసరం లేదు, ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడండి, ఇదే నాకు హానర్ అంటూ చంద్రబాబు బదులు ఇచ్చారు. నన్ను ఎందుకు అడ్డుకున్నారో చెప్పండి, నేను ప్రజలను కలవాలి అంటూ చంద్రబాబు బదులు ఇచ్చారు. అయితే ఇదంతా పక్కన పెడితే, చంద్రబాబు పక్కనే నెల పైన మోకాళ్ళ మీద కూర్చున్న పోలీసులు, చంద్రబాబుని బ్రతిమిలడుతూ ఉన్న దృశ్యాలు చూసిన అందరికీ, పోలీసులు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్ధం అవుతుందని అంటున్నారు. అయితే చేసింది అంతా చేసి, ఇప్పుడు ఇలా చేయటం ఎందుకు అని అనే వాళ్ళు కూడా ఉన్నారు.

Advertisements