రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూంటారు. అందుకే.. ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ఆయన కచ్చితంగా డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలొస్తాయనే అంచనాలతో ఉన్నారు. అలా వస్తే.. వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారు. పార్టీ పరంగా కసరత్తు కూడా ప్రారంభించారు. డిసెంబర్ అంటే.. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనేదే ఏపీ అధికార పార్టీ భావన. ఇటీవలి కాలంలో చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిపినా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీ సమీక్షను మూడు నెలల కిందటే ప్రారంభించారు. వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. 40 నియోజకవర్గాలలో పార్టీ వెనుకబడి ఉందని నిర్దారించుకుని వాటిపై దృష్టి పెట్టారు. పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.

cbnoperation 01072018 2

ఈ నేపధ్యంలోనే, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చంద్రబాబు టీమ్‌లను రంగంలోకి దించారు. ఒక్కో జిల్లా బాధ్యతను ఇద్దరు ప్రొఫెసర్లకు అప్పగించారు. సర్వేలో నిష్ణాణుతులైన ప్రొఫెసర్లకు చంద్రబాబు స్వయంగా తయారు చేసారు. ఈ ప్రొఫెసర్లు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సమాచారాన్ని సేకరి స్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, వారి పై ఉన్న ఆరోపణలు, అనుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొంటున్నారా లేదా? ఎమ్మెల్యే అందరినీ కలుపుకుని వెళ్తున్నారా? ఇసుక తవ్వకాల్లో తల దూర్చుతున్నారు? ప్రజలు ఆ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు? టికెట్‌ ఇస్తే మళ్లీ గెలుస్తారా? వంటి అనేక ప్రశ్నలతో టీడీపీ ప్రొఫెసర్లు విశ్లేషణాత్మక సమచారాన్ని సేకరిస్తున్నారు.

cbnoperation 01072018 3

ప్రస్తుతం జరుగుతున్న సర్వే నివేదిక అందాక, వచ్చే నెలలో చంద్రబాబు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం కాబోతున్నారు. ఆ నివేదికలోని అంశాలను వారి ముందుంచుతారని సమాచారం. నివేదికలో ప్రతికూల రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల చిట్టాను వారి ముందుంచి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి తుది హెచ్చరిక చేస్తారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి మూడు నెలల సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఆ సమయం లోగా పని తీరును మెరుగుపరుచుకోలేకపోతే టికెట్‌పై ఆశలు వదులుకోలని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో సర్వే పూర్తయ్యింది. అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయ్యే సరికి పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై చంద్రబాబు ఒక అంచనాకు వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Advertisements