తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్లర్ల ఉదంతంపై కేంద్ర ఎన్నికల సంఘానికి 22 పేజీల సుధీర్ఘ లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. బోగస్ ఓటర్లపై తెలుగుదేశం అనేక పిర్యాదులు ఇచ్చినప్పటికీ ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2019 పోలింగ్ తో పోల్చితే ఏప్రిల్ 17, 2021 న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది? తిరుపతి పార్లమెంటు పరిధిలోని తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటులో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. బయట వ్యక్తుల ప్రభావంతో అసలు ఓటర్లు పోలింగ్ లో పాల్గొనలేకపోయారు. నకిలీ ఈ.పి.ఐ.సి కార్డులతో వందల మంది బయట వ్యక్తులు వాహనాలలో తిరుపతిలో ప్రవేశించారు. ఫేక్ ఓటర్లకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను జత చేసిన చంద్రబాబు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ ను లేఖకు జత చేసిన చంద్రబాబు. దొంగ ఓటర్ దారులు వాలంటీర్ల సహాయంతో ఎలక్టోరల్ పోటో ఐడెంటిటీ కార్డుల (ఈపిఐసీ) ద్వారా దొంగ ఓట్లు వేశారు. ఏప్రిల్ 15 వ తారీఖు ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉండి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ ప్రసాద్, మాచర్ల ఎమ్మెల్యే ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడ్డారు.

పోలింగ్ రోజైన 17 వ తారీఖు 250 వాహనాలను వెనక్కు పంపామని డిజీపీ స్వయంగా చెప్పారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు దొంగ ఓటర్లను రెడ్ హేడెండ్ పట్టుకున్నారు. స్థానిక ఎన్నికల అధికారులకు పిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి, 80 సంవత్సరాలు పైబడిన వృద్దుల నుండి పోస్టల్ బ్యాలెట్లను వైసీపీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజల విశ్వాసాన్ని పటిష్టపరిచేందుకు తిరుపతి అసంబ్లీ సెగ్మెంటులో రీ-పోలింగ్ నిర్వహించండి. అధికార వైకాపా తప్పా అన్ని ప్రతిపక్ష పార్టీలు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటులో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisements