క-రో-న సెకండ్ వేవ్ మన దేశంలో రోజు రోజుకీ ఉదృతం అవుతుంది. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. దగ్గర వారు కూడా క-రో-నా బారిన పడటం, ఇప్పుడు వింటున్నాం. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క, మందులు దొరక్క, ఇలా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు స్మశానాల్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారటంతో, కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఇంట్లో ఉన్న వారు కూడా మాస్కు పెట్టుకోవాలని, ఇలా పెట్టుకోవటం ఉత్తమం అని కేంద్రం సూచించింది. వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో, ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని సూచనలు ఇచ్చింది. మాస్కులు ధరిస్తే కో-వి-డ్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని తెలిపింది. అలాగే ఇంటికి ఎవరినీ రానీయవద్దని, ఎంత తెలిసిన వారు అయినా దూరం పెట్టాలని సూచించింది. అనవసరంగా బయట తిరగటం కూడా మంచిది కాదని సూచించింది. ఇంట్లో ఎవరికైనా పోజిటివ్ వస్తే, మిగిలిన వారు కూడా మాస్కు ధరించాలని కేంద్రం ప్రకటన చేసింది.

Advertisements