వైసిపీ, బీజేపీ బంధం ఓపెన్ అయిపోతుంది... ఇక విజయసాయి రెడ్డి, ఏ మీడియా వాడు చూస్తాడా అని దొంగ చాటుగా వెళ్లి మోడీని కలవాల్సిన పని ఉండదు... జగన్ మోహన్ రెడ్డి, కేసుల గురించి భయపడాల్సిన పని లేదు... ఇక ముసుగులో గుద్దులాటలు లేవు... అంతా ఓపెనే... ఈ రోజు కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే విజయవాడలో పర్యటించారు... ఈ సందర్భంలో ఆయన జగన్ పై చేసిన వ్యాఖ్యలు అదిరేలా ఉంటే, జగన్ కేసుల పై చేసిన వ్యాఖ్యలు బెదిరేలా ఉన్నాయి... మొత్తానికి, అనుకున్న ప్లాన్ ప్రకారం, స్టెప్ బై స్టెప్, వైసిపీ - బీజేపీ త్వరలోనే కలిసిపోతున్నాయి... విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అవ్వటం, జగన్ కేసులు ఒక్కోటి వీగిపోవటం, మనం చూడ బోతున్నాం... ఈ రోజు విజయావాడలో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారాయి.

jagna nda 26042018

ఓ వైపు ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అంటూనే.. మరోవైపు వైసీపీ రాకపై సానుకూలంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. జగన్‌పై ఉన్న కేసుల్లో ఏవీ ఇంకా నిరూపితం కాలేదని రాందాస్‌ అథవాలే చెప్పుకొచ్చారు. అవి కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన కేసులని, అవి ఇంకా నిరూపితం కాలేదని అన్నారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి. మరో పక్క ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం బాధించిందంటూనే 2019లో చంద్రబాబు తిరిగి ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అన్నారు. అలా జరగని పక్షంలో జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామని అన్నారు.

jagna nda 26042018

వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతోనే కేంద్రం ఏపీని పట్టించుకోవట్లేదన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలకు రాందాస్‌ అథవాలే కామెంట్లు బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే, ఇదంతా అందరూ ఊహించిన పరిణామమే... కాకపోతే, ఇంత తొందరగా ఓపెన్ అప్ అవుతరానని అనుకోలేదు... మరో పక్క, పవన్ ఉండనే ఉన్నాడు... ఈ నేపధ్యంలో, ఆపరేషన్ గరుడ, అనుకున్న ప్రకారమే నడుస్తుంది... ఇప్పటి వరకు పార్ట్ వన్ లో, అన్నీ గ్రౌండ్ లెవెల్ లో సెట్ చేసి పెట్టారు.... ఇప్పటికే కర్ణాటకలో, గాలి పై ఉన్న కేసులన్నీ ఎలా వీగిపోయాయో చర్చించుకుంటూ ఉన్న సమయంలో, ఇప్పుడు జగన్ కూడా ఎన్డీఏలో చేరి, తన కేసులు కూడా మాఫీ చేసుకుంటాడు అని, అవసరం అయితే ఎన్నికలు అయిన తరువాత తన పార్టీ, బీజేపీలో విలీనం చేస్తాడు అని ఎప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisements