ప్రమాదవశాత్తూ అంగవికలురాలైన తనకు కృత్రిమ చేయి అమర్చడంలో మానవతాదృక్పథంతో సాయమందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్జ్ఞతలు తెలిపిన దాసుపురం శ్రీలత. శాసనసభ భవనంలోని ఛాంబర్ లో సీఎం చంద్రబాబును తల్లిదండ్రులతో వచ్చి కలసిన దాసుపురం శ్రీలత. అమరావతిలో నిట్ లో చదువుతున్న శ్రీలత గత మేలో నిట్ ను సందర్శించినప్పుడు శ్రీలతకు కుడిచేయి భుజం వరకూ లేకపోవడాన్ని గమనించి స్వయంగా కారణాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.

కృత్రిమ చేయి అమర్చుకునేందుకు శ్రీలతకు తక్షణం రూ. 4.20 లక్షలు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు. విజయవాడలోని ఆర్థోటిక్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ లో కృత్రిమ చేయిని అమర్చుకున్న శ్రీలత. ప్రస్తుతం బయోనిక్ ప్రొస్థెటిక్స్ ప్రమాణం గల కృత్రిమ చేయితో రాయగలుగుతున్నానని సీఎం చంద్రబాబుకు తెలిపిన శ్రీలత. ఆత్మసైర్యంతో మసలుకుంటూ చదువులో మరింత రాణించాలని శ్రీలతకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు.

అయిదో ఏట బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో నిద్రలో కిటికీ బయటకు వచ్చిన శ్రీలత కుడి చేతిని లారీ ఢీకొంది. చికిత్స అనంతరం అప్పటి నుంచి కుడి భుజం వరకూ చేయి లేకపోవడంతో ఎడం చేతితోనే రాయడం అలవాటు చేసుకున్న శ్రీలత. పదో తరగతిలో 87 %, ఇంటర్ లో 91% మార్కులతో చదువులో మంచి ప్రతిభ చూపి ఈ ఏడాది నిట్ లో చేరిన శ్రీలత. శ్రీలతకు ఇప్పుడు కృత్రిమ చేయి అమర్చడంతో కుడి చేతితో రాయగలగడంలో మీ దయ, తోడ్పాటు మరవలేనిదని సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేసిన శ్రీలత తల్లిదండ్రులుఅవతారం, అప్పలమ్మలు
 
      
