66 రోజులు పాటు జైలులో ఉండి, గత శనివారం, 18 కేసుల్లో బెయిల్ తెచ్చుకుని, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల అయిన సంగాతి తెలిసిందే. అయితే చింతమనేని వచ్చిన రెండు రోజులకే మరో కేసు నమోదు అయ్యింది. అయితే ఇది ఎవరో ప్రైవేటు వ్యక్తులు పెట్టిన కేసు కాదు. నిబంధనలు ఉల్లంఘించారు అంటూ పోలీసులు పెట్టిన కేసు. చింతమనేని విడుదల తరువాత, పెద్ద ర్యాలీ తీస్తారని తెలిసి, దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, పోలీసులు జిల్లా అంతటా సెక్షన్ 30 అమలు చేసారు. ఈ నిబంధన ప్రకారం, ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు పెట్ట కూడదు. అయితే, చింతమనేని విడుదల అవుతున్నారని తెలుసుకుని, పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికారు. దారి పొడవునా చింతమనేనికి ఘన స్వాగతం పలికారు. అయితే జిల్లాలో పోలీసు యాక్టు-30 అమలులో ఉండగా, చింతమనేని ర్యాలీ తీసారని, పోలీసులు అభియోగం మోపారు.

chintamaneni 18112019 2

చింతమనేని ర్యాలీ వస్తున్న సమయంలో, అక్కడ త్రీటౌన్‌ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎ్‌సఎస్‌ మూర్తి తన సిబ్బందితో శనివారపుపేటలో గస్తీ నిర్వహిస్తున్నారు. చింతమనేని ర్యాలీతో, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అలాగే, పోలీసు మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంఘించారని, లూరు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో చింతమనేని పై కేసు నమోదు చేసారు. చింతమనేనితో పాటుగా, తెలుగుదేశం నేతలు, రవి, చలమోల అశోక్‌గౌడ్‌, దాసరి ఆంజనేయులు, వేంపాటి ప్రసాద్‌, సహా మరి కొందరి పై, కేసు నమోదు చేసారు. అయితే ఈ కేసు పై చింతమనేని అనుచరులు మాత్రం, వేరేగా స్పందిస్తున్నారు. పెద్ద ఎత్తున, ప్రజలు, కార్యకర్తలు వస్తే, వారికి అభివాదం తెలపటం కూడా తప్పా అని ప్రశ్నిస్తున్నారు.

chintamaneni 18112019 3

ఇక మరో పక్క, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, చింతమనేని నివాసానికి రానున్నారు. నేటి నుంచి మూడు రోజల పాటు, పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి పై సమీక్ష చెయ్యనున్నారు. ఈ సమీక్ష తణుకులోని భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కల్యాణ మండపంలో జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా, చంద్రబాబు ఈ రోజు ఉదయం 12 గంటలకు, ఏలూరు సమీపంలోని దుగ్గిరాల గ్రామంలో, చింతమనేని ఇంటికి చంద్రబాబు రానున్నారు. అయితే చంద్రబాబు పర్యటన పై పోలీసులు ఆంక్షలు విధిస్తూ, కొంత మండి టిడిపి వారిని అదుపులోకి తీసుకున్నారని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 20 మందిని అరెస్ట్ చేసారని, వారిని వెంటనే విడుదల చెయ్యాలని టిడిపి అంటుంది.

Advertisements