ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు తెలపటం కుడా పాపంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో. సహజంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీసులు, టిడిపి నేతలు ఏదైనా నిరసన అంటే హౌస్ అరెస్ట్ లు చేయటం చూస్తూ ఉన్నాం. నిన్న పెట్రోల్, డీజిల్ రెట్ల పెరుగుదల, రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అధికంగా వసూలు చేస్తున్న పన్నుల గురించి, టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. అయితే హౌస్ అరెస్ట్ లు చేయటం మర్చిపోయారో ఏమో కానీ, నిరసన అయిపోయిన తరువాత, ఇప్పుడు అరెస్ట్ లు మొదలు పెట్టారు పోలీసులు. మాజీ ఎమెల్యే చింతమనేని ప్రభాకర్ ను విశాఖ వెళ్లి మరీ అరెస్ట్ చేసారు. ఏదైనా పెద్ద కేసులో అరెస్ట్ చేసారేమో అని అందరూ అనుకున్నారు. విశాఖ వెళ్లి మరీ అరెస్ట్ చేయటంతో, ఏదో పెద్ద కేసు అనుకుంటే, చివరకు నిన్న జరిపిన నిరసనలో, పోలీసుల విధులకు చింతమనేని ఆటంకం కలిగించారు అని అభియోగం. దీని పై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరుగుతున్న ఒక వివాహానికి చింతమనేని వెళ్ళారు. వివాహనికి వెళ్ళిన చింతమనేని అక్కడకు వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేసారు. నిన్న పెట్రోల్ ధరల పెంపు పై ఎమ్మార్వో ఆఫీసుకు వినతి పత్రం ఇవ్వటానికి వెళ్ళగా, అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేసారు. 

Advertisements