66 రోజుల తరువాత, జైలు నుంచి విడుదల అయిన చింతమనేని ప్రభాకర్, ఆయన స్వగృహంలో ప్రెస్ మీట్ పెట్టరు. ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందుల పై విరుచుకు పడ్డారు. నేను దోపిడీ చెయ్యలేదు అని, హత్యలు చెయ్యలేదని, చిన్న చిన్న కేసులు పెట్టి, లోపల ఉంచారని అన్నారు. దళితులను నన్ను తిట్టారు అంటున్నారు, దళితుల వద్దకు రండి,నేను ఎవరి భూములు అయినా లాక్కున్నానా నిరూపించండి, నా మీద పెట్టిన కేసుల మీద బహిరంగ విచారణ చేయించండి, దళితుల దగ్గరకు వెళ్లి మాట్లాడండి, నేను అన్యాయం చేశానేమో అడగండి, పెట్టిన కేసుల్లో నిజం ఉంటే ఏ శిక్ష అయినా వేయండి., ఏ విచారణకు అయినా సిద్ధం.. మొత్తం 13 ఊళ్ళ నుంచి, 13 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, వారి దగ్గరికే వెళ్లి అడుగుదాం, మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తా, ఒక్కరైన వారికి నేను అన్యాయం చేసారు అని చెప్తే, జగన్ అవసరం లేదు, కోర్ట్ లు అవసరం లేదు, నాకు నేనే ప్రజల ముందే శిక్ష వేసుకుంటా అని చింతమనేని అన్నారు.

chintaman 161192019 2

ఇక అలాగే జగన్ సర్కార్ కి మరో ఛాలెంజ్ విసిరారు. ఈ కేసులు ఇవన్నీ అవసరం లేదు, మీరు మమ్మల్ని ఎలాగూ ఇబ్బంది పెడుతున్నారు, మీకే ఆఫర్ ఇస్తున్నా అంటూ సవాల్ విసిరారు. "నేను వనజాక్షిపై ధౌర్జన్యం చేశానని.. ఈడ్చేశానని..ధుర్భాషలాడాని..ఆరోపణలు చేశారు.. మీడియా మిత్రులూ అలానే రాశారు.. మరి ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టినోళ్లు ఆ విషయం మీద కేసు ఎందుకు పెట్టలేదు? మీడియా మిత్రులు ఆ విషయం మీరెందుకు అడగరు ప్రబుత్వాన్ని? నేను ఇప్పుడు డిమాండ్ చేస్తన్నా.. ఆ విషయం మీద విచారణ జరపండని .. మీడియా మిత్రులూ మీరూ అడగండి .. ఆ విషయంలో నాపై కేసు ఎందుకు పెట్టట్లేదు అని ..ఆరోజు చెప్పా.. నేడు చెప్తున్నా.. వనజాక్షి విషయంలో ఏవిధమైన అమర్యాద పూర్వకంగా నేను ప్రవర్తించలా. ఆ కేసు రీఓపెన్ చేసి, మళ్ళీ ఎంక్వయిరీ చేసి, నేను తప్పు చేసాను అని నిరూపించి, లోపల వెయ్యండి అంటూ, ప్రభుత్వానికే చింతమనేని సవాల్ విసిరారు.

chintaman 161192019 3

మరి చింతమనేని ప్రభాకర్ సవాల్ పై, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క మీడియా పై కూడా చింతమనేని వ్యాఖ్యలు చేసారు. ఉన్నది ఉన్నట్టుగా రాయటానికి కూడా మీడియా భయపడుతుందని అన్నారు. ఇంత ఘోరంగా పరిపాలన జరుగుతుంటే, మన మీడియా మాత్రం, అసలు పట్టించుకోవటం లేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చెప్పలేక పోతున్నారని అన్నారు. ధైర్యంగా రాయండి అంటూ, మీడియాకు సూచించారు. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవడం అంటే, రైతు భరోసా అమలు చేయడం, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇవ్వడం, ఆరోగ్య శ్రీ అమలు చేయడం మాత్రమే కాదు, శాంతిభద్రతలను అమలు చేసి, ఇతరుల మనసులు గాయపర్చకుండా ఉన్నప్పుడే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారని హితవు పలికారు.

Advertisements