రాజధాని అమరావతి కేసులు విచారణ ఈ రోజు హైకోర్టులో కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయ్యింది. త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఈ వాదనలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం తరుపు న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులను ఈ బెంచ్ నుంచి విచారణ నుంచి తప్పించాలని కోరారు. వారికి అమరావతిలో, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఫ్లాట్లు వారికి ఇవ్వటం వలన, వారికి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తో పాటుగా, మరో న్యాయవాది కూడా ఈ అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని, రాష్ట్ర హైకోర్టులో ఉండే న్యాయమూర్తులకు, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఆస్తులు ఉంటాయని, ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటే, ఈ కేసుని వేరే రాష్ట్రంలోకి బదిలీ చేయాల్సి ఉంటుందని, వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలోనే సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జోక్యం చేసుకుని, ఒక వేళ మీరు మా విజ్ఞప్తిని తోసి పుచ్చితే, ఈ విషయాన్ని ఫైనల్ జడ్జిమెంట్ లో పోస్ట్ చేయాలని కోరారు. దీని పైన తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని కోరారు. అయితే హైకోర్టు మాత్రం, న్యాయమూర్తులను తప్పించే అవకాసం లేదని, వాదనలు కొనసాగించాలని కోరారు.

cj 15112021 2

హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‍కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి రోజు కూడా ఈ కేసు పై రోజు వారీ విచారణ చేస్తామని స్పష్టం చేసారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో ఈ కేసులు విచారణ కారణంగా, ఈ కేసులు కారణంగా అభివృద్ధి ఆగిపోయినట్టు కనిపిస్తుందని, కక్షిదారులతో పాటుగా, ఇది అందరికీ ఇబ్బందిగా మారిందని, ఈ నేపధ్యంలోనే ఈ కేసులు విచారణ తొందరగా చేపట్టి, పూర్తి చేయాల్సిన బాధ్యత హైకోర్టు పై ఉందని, ఆయన స్పష్టం చేసారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో ఎటువంటి మార్పులు ఉండ బోవని, ఈ త్రిసభ్య ధర్మాసనం మందే అందరూ వాదనలు వినిపించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే వాదనలను హైబ్రిడ్ పధ్ధతిలో కాకుండా నేరుగా వచ్చి వినిపిస్తే, ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుందని చెప్పటంతో, ప్రభుత్వ తరుపు న్యాయవాది దుష్యంత్ దవే తాను కూడా నేరుగా వచ్చి వాదనలు వినిపిస్తానని చెప్పారు. రైతులు తరుపున సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు ప్రారంభించారు. ఇక నుంచి రోజు వారీ విచారణ జరగనుంది.

Advertisements