రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో నేటి దినం అత్యంత దురదృష్టకరమని, కరోనాపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్యోగులసంక్షేమాన్ని గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ పీ. అశోక్ బాబు వాపోయారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనాతో ఇప్పటికే సచివాలయంలో నలుగురు ఉద్యోగులు చనిపోయారని, ఇద్దరు ఉపాధ్యాయలుకూడా మరణించారని, ఇక వైద్యులు, నర్సులైతే మొదటిదశలోనే చాలామంది చనిపోయారని అశోక్ బాబు తెలిపారు. చనిపోతున్నాకూడా ప్రాణాలను లెక్కచేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్లైన పారిశుధ్యకార్మికులు, వైద్యులు, నర్సులు, ఇతరేతరవిభాగాలకు చెందిన వారు పనిచేస్తేనే తొలిదశ కరోనాను చాలావరకు నియంత్రిం చడం జరిగిందని అశోక్ బాబు చెప్పారు. దాదాపు ఏపీలో 100కులోపు కరోనా కేసులు నమోదవ్వడం జరిగిందన్నారు. తరువాత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే, రెండోదశకరోనావ్యాప్తిలో రాష్ట్రం, అటూ ఇటూగా మహారాష్ట్రతో పోటీపడుతోందన్నారు. కరోనా నియంత్రణలో ఉద్యోగులే ప్రధానపాత్ర వహించారని, వైద్యవిభాగంతోపాటు, ప్రభుత్వ పాలనాయంత్రాంగం కూడా ప్రధానభూమిక పోషించిందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని (వర్క్ ఎట్ హోమ్) గతప్రభుత్వమే కల్పించిందని, 80శాతం ఉద్యోగులకు అలాంటి అవకాశాన్ని కల్పించవచ్చన్నారు. రెండోదశ కరోనాను నియంత్రించడంతోపాటు, ఉద్యోగులంతా విధిగా పనిచేస్తేనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవచ్చ న్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదుగానీ, దేశంలో అవసరమైన చోట పరీక్షలు రద్దుచేయడం, లాక్ డౌన్ అమలుచేయడం, రాత్రి కర్ఫ్యూ విథించడం వంటి నిర్ణయాలను అనేక ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయన్నారు. సమాజం కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న అశోక్ బాబు, ఆసుపత్రుల్లో పడకలకొరత, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

ఇతరరాష్ట్రాలతో పోలిస్తే కొంతలో కొంత ఏపీలో ఆక్సిజన్ కొరత 50శాతం మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వఉద్యోగులు కరోనాతో ఆసుపత్రుల్లో చేరితే, వారిని చేర్చుకోవడంలేదని, బెడ్లు (పడకలు) కూడా దొరకడంలేదన్నారు. ప్రభుత్వఉద్యోగు లకు కరోనా వచ్చాక హాడావుడిచేసేబదులు, వారికి ఆ సమస్య రాకముందే ప్రభుత్వంచర్యలు తీసుకుంటే మంచిదని అశోక్ బాబు హితవుపలికారు. ప్రభుత్వపథకాలు అమలుకావాలన్నా, ప్రజలకు సేవలు అందాలన్నా, రెండోదశ కరోనాను నియంత్రించాలన్నా, అన్నిరకాల ఉద్యోగులు పనిచేస్తేనే అవి సాధ్యమవు తాయన్నారు. మున్సిపల్ , వైద్యారోగ్య శాఖలతోపాటు పోలీస్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు విధిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీచేయాలంటే కేవలం అది ఒక్క వైద్యశాఖతోనే సాధ్యంకాదన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటే, అన్నిశాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. వైద్యులు, నర్సులకు మాత్రమే పీపీఈ కిట్లు అందిస్తే సరిపోదని, అన్నిశాఖల విభాగాధిపతులు, వారికింద పనిచేసే నాలుగోతరగతి ఉద్యోగులవిషయంలో కూడా అన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని టీడీపీఎమ్మెల్సీ స్పష్టంచేశారు. సచివాలయంలో నలుగురు ఉద్యోగులు, కొన్నిచోట్ల ఉపాధ్యాయులు మరణించినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందన్నారు.

ప్రాణం అన్నింటికంటే ముఖ్యమైనదని, ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే వారందరికీ ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రఉద్యోగుల సంఘం అధ్యక్షుడే కరోనాతో ఆసుపత్రిలోచేరాడన్నారు. ఉద్యోగులను రెండోశ్రేణి పౌరులుగా చూడకుండా, వారికి ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించాలని, అలాచేస్తే నే ప్రభుత్వ పనితీరు ప్రజలకు చేరుతుందన్నారు. పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ఉంటే, వెంటనే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. అలానే చనిపోయినఉద్యోగులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. కరోనాతో మరణించినప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్లకు వర్తించే ప్రయోజనాలనే ఇతర ఉద్యోగులకు కూడా ప్రభుత్వం వర్తింపచేయాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisements