అనుకున్నదే అయ్యింది. తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన మండలి ఉండటానికి వీలు లేదు అంటూ, మండలి రద్దుకి దాదపుగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం, అసెంబ్లీలో ఈ విషయం పై నిర్ణయం తీసుకుందామని జగన్ అన్నారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారం కూడా ఒకే చెప్పారు. అంతకు ముందు జగన్ మండలి పై, అసెంబ్లీలో మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రానికి మండలే అవసరం లేదని, మనకు అసెంబ్లీలోనే ఎంతో మంది మేధావులు ఉన్నారని, వీళ్ళు మంచి సలహాలు ఇస్తారని అన్నారు. మండలిలో సలహాలు ఇవ్వాల్సింది పోయి, కుట్రలు చేస్తున్నారని మండలి పై మండి పడ్డారు. మండలి కోసం, ఏడాదికి 60 కోట్లు ఖర్చు అవుతుందని, అసలు మండలి ఎందుకు అని జగన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మండలి లేదని, కేవలం 6 రాష్ట్రాలకే ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని ప్రలోభ పెట్టారని జగన్ అన్నారు. అలాగే చైర్మెన్ పై కూడా జగన్ వ్యాఖ్యలు చేసారు. ఆయన చట్టం తో కాకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని అన్నారు.

jagan 23012020 2

నిన్న కూడా జగన్ మోహన్ రెడ్డి, మండలిలో ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండలిలో చర్చ జరిగిన బిల్లులపై సెలక్ట్ కమిటీకి వెళ్ళాచ్చా అనే అంశంపై ఆరా తీశారు. బుధవారం రాత్రి ఆయన అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మండలిలో బిల్లును ఆమోదింప చేసుకోవడంలో విఫలమైనప్పటికి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. మండలి వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకుడదని ఖచ్చితంగా విపక్షానికి బుద్ధి చెప్పాలని ఆయన ప్రణాళికలు రచించారని లీక్లు ఇచ్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మంత్రులు, అధికార పార్టీ ముఖ్య నాయకులంతా మండలిలో తిష్ట వేసినా విపక్షాన్ని ఎదుర్కొలేక పోయామని ఇటువంటి పరిస్థితు ల్లో మండలిలో బలమున్న టిడిపిని ఎలా బలహీనపరచాలా..? అన్న అంశంపై కూడా సీఎం జగన్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

jagan 23012020 3

అదే విధంగా ప్రస్తు తం సెలక్ట్ కమిటీకి వెళ్ళిన బిల్లును పరిస్థితి ఏమిటీ..? వాటిని మార్చే అధికారం కమిటీకి ఉంటుందా..? లేక అదే రూపంలో వాటిని ఆమో దించాలంటే ఎంత సమయం పడుతుంది..? గతంలో ఆ రకంగా ఆమోదించిన బిల్లులు ఏమైన ఉన్నాయా..?ఉంటే సెలక్ట్ కమిటీని ఎలా ఎదుర్కో వాలి..? అన్న కోణంలో కూడా ఆయన ఆరా తీశారు. ఒకవేళ మూడు నెలల తర్వాత సెలక్ట్ కమిటీ కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలి..? ఈ లోపు అభివృద్ధి వీకేంద్రీకరణ అంశంపై ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా..? అందుకోసం న్యాయ నిపుణుల సలహా క వాడా తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం వెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు మండలి రద్దు ప్రతిపాదన పెడితే ఎలా ఉంటుందన్న ఓ సీనియర్ నేత అభిప్రాయంపై కూడా సీఎం జగన్ లోతుగా ఆలోచన చేసినట్టు తెలిసింది. నిన్న రాత్రి చ్ప్పినట్టే, ఈ రోజు జగన్ మండలి రద్దు ప్రతిపాదన తీసుకొచ్చారు.

Advertisements