నిన్న శాసనసభలో, వికేంద్రీకరణ బిల్లు పై జరిగిన చర్చలో, మంత్రులు, ఒక్కోక్కరు చంద్రబాబు పై ఎలా హేళన చేస్తూ మాట్లాడారో చూసాం. వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా, చంద్రబాబు మాత్రం ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా, అన్నీ భరించారు. ఎన్ని మాటలు అన్నా ప్రజల కోసం పడతాను అని చెప్పారు. అయితే, ఒక్క రోజులోనే సీన్ రివర్స్ అయ్యింది. నిన్న అలా హేళన చేస్తూ మాట్లాడిన మంత్రులు, ఈ రోజు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. శాసనమండలిలో, 14 మంది మంత్రులు, శాసనమండలి చైర్మెన్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలుపుతూ, సభ జరగనివ్వకుండా చేయ్యాటంతో, ప్రభుత్వమే సభ నడవనివ్వకుండా చెయ్యటం సిగ్గు చేటు అంటూ, తెలుగుదేశం సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేసారు. ఏకంగా మంత్రులే ఆందోళన చెయ్యటంతో, చైర్మెన్ సభను 10 నిమిషాలు వాయిదా వేసారు. ఈ రోజు శాసనమండలిలో, వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం తరుపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

sasanamandali 21012020 2

అయితే వెంటనే అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ, రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇచ్చింది. బిల్ కంటే ముందే ఈ నోటీస్ పై చర్చించాలని కోరింది. రూల్స్ అన్నీ చూసిన చైర్మెన్, రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. రూల్ 71 అంటే, ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్ పై, వ్యతిరేకత తెలపటం. ఈ రూల్ 71 పై చర్చ జరిగితే, ఇక ప్రభుత్వం, వికేంద్రీకరణ బిల్లు కాని, సీఆర్డీఏ రద్దు బిల్లు కాని ప్రవేశ పెట్టే అవకాసం ఉండదు. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. శాసనమండలిలో బిల్ పెడితే చాలు, 14 రోజులు తరువాత డీమ్డ్ టు బి అప్రూవ్ కింద అయిపోతుందని, అందుకే శాసనమండలిలో బలం లేకపోయినా, తెలుగుదేశం పార్టీ తిరస్కరించినా, ఎలాగైనా బిల్ ని ఆమోదింపచేసుకోవచ్చు అం భావించారు.

sasanamandali 21012020 3

అయితే అనూహ్యంగా ఈ రోజు ఉదయం, తెలుగుదేశం పార్టీ రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇవ్వటంతో, ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో, ఇలా కుదరదు, ప్రభుత్వాలు ఇలా అయితే నడవవు అంటూ, ఆందోళన బాట పట్టారు. 14 మంది మంత్రులు కౌన్సిల్ చైర్మెన్ పోడియంని చుట్టు ముట్టి నినాదాలు చేసారు. దీనికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వమే ఇలా చెయ్యటం సిగ్గు చేటు, అంటూ షేమ్ షేమ్ అంటూ, నినాదాలు చేసింది. దీంతో, సభలో గందరగోళం ఏర్పడింది. తెలుగుదేశం ఇచ్చిన నోటీసు తో, వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. మండలిలో బిల్లు పెట్టి వీగిపోతే డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద ప్రభుత్వానికి ఆమోదం చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే పెట్టకపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisements