అంతా అనుకున్నట్టే జరిగింది. తన మాట వినని, శాసనమండలిని రద్దు చేస్తూ, జగన్ అధ్యక్షతన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు భేటీ అయిన క్యాబినెట్, శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసింది. మరో కొద్ది సేపట్లో, ఈ బిల్ శాసనసభలో ప్రవేశపెట్టి, బిల్ ఆమోదించి, కేంద్రానికి పంపనున్నారు. నేడు ఏపీ అసెంబ్లీలో ఏమి జరగబో తుంది..? అనే అంశంపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజలు ఆసక్తి ప్రదర్శించారు. అయితే జగన్ మాత్రం అనుకున్నదే చేసారు. గత వారం మండలిలో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఇప్పుడు జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో మండలి రద్దుకు తీర్మానం తీసుకుంటే, మరోవైపు మండలి చైర్మన్‌ షరీఫ్ సెలక్ట్ కమిటీ ఏర్పాటుకుసన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం, అలాగే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. కాగా మండలిరద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేసిన నేపథ్యంలో తెదేపా కూడా ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది.

jagan 27012020 2

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఉభయ పక్షాల నేతలు ఆదివారం సమావేశమై తమ సభ్యులతో చర్చించారు. తేదీ శాసనసభాపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశానికి వెళ్ళకూడదనిటీడీఎల్సీలోనిర్ణయించారు. బుధవారం మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై తెదేపా గురువారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. శాసనమండలిలో జరిగిన చర్చను శాసనసభలో చర్చించడాన్ని వారంతా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని వారంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా శాసనసభలో చర్చలు జరుగు తున్న నేపథ్యంలో వాటికి దూరంగా ఉండాలని తెదేపా నేతలు నిర్ణయం తీసుకున్నామని చెబుతు న్నారు.

jagan 27012020 3

ఇదిలావుండగా మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో పెద్దల సభను రద్దు చేయాలని జగన్ భావించారు. కాగా సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్సార శాసనమండలిని తీుకువచ్చారని, దానిని రద్దు చేసేందుకు ప్రయత్నించకండి అని కొందరు నేతలు సూచించినట్లు సమాచారం. అలాగే శాసనమండలిలో ఏదో విధంగా మెజార్టీ సంపాదించుకోండని, ఒకవేళ మెజార్టీ తాత్కాలికంగా లేకున్నా, మరో రెండేళ్ళ తర్వాత మన పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. అప్పటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా తట్టుకుందామని, ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలి రద్దుకు ప్రయత్నించకండి అని కొంతమంది శ్రేయోభిలాషులకు జగన్ కు నచ్చజెప్పినట్లు తెలిసింది.అయినా జగన్ వినలేదు, తను అనుకున్నదే చేసారు.

Advertisements