రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వాకంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా లాక్ డౌన్ అనంతరం విద్యుత్ బిల్లులు రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఫిబ్రవరి నెల్లో రూ.640లు వచ్చిన బిల్లు మార్చిలో కూడా అదే క్రమంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని సిబ్బంది కరోనా కారణంగా బిల్లులు ఇవ్వరని ఆ శాఖ తెలిపింది. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా ఆ సరాసరి ప్రకారం వినియోగదారులు 90శాతం మంది ఆన్లైన్లో చెల్లించారు. తీరా మే నెలలో విద్యుత్ బిల్లులు చూస్తే సామాన్యుడి గుండె పగిలినట్లుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీలకు 300 యూనిట్లు లోపు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకున్నప్పటికి దాదాపుగా 50 శాతానికి పైగా ఎస్సీ వినియోగదారులు బిల్లులు మోతపై నోటిమీద వేలువేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే 3నెలలుగా మధ్య తరగతి ప్రైవేటు ఉద్యోగులకు పనుల్లేక, చేతివృత్తి దారులు ఇళ్లకే పరిమితమైన సందర్భంలో విద్యుత్ వినియోగం పై ఛార్జీలు పెంచి వసూళ్లు చేయాలన్న ఆ శాఖ తీరును ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏప్రిల్ నెల బిల్లు సరాసరి కట్టినప్పటికి అధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్లు యూనిట్లు పెరగడంతో పాటు టారిప్లు పెంచడం జరిగిందని ఆశాఖాధికారులు వివరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై లాక్ డౌన్ అమలు కారణంగా పనులు, వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మధ్యతరగతి, ప్రైవేటు, చేతివృత్తి దారులు అత్యధికంగా అద్దె ఇళ్ల లోనే జీవనం సాగిస్తున్నారు.

దీనికి సంబంధించి సిటీ పరిధిలో అద్దె రూ. 5 వేలు చెల్లిస్తున్న ఒక వ్యక్తికి విద్యుత్ బిల్లు రూ.6వేలు రావడంపై తీవ్ర మనోవేదనకు గురైనట్లు వివరించారు. లాక్ డౌన్ నేపధ్యంలో కూడా ఏఏఎపిడిసిఎల్ అధికారులు విద్యుత్ వినియోగదారుల పై బిల్లుల రూపంలో మానసిక దాడి చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం ప్రజల నుండి వ్యక్తమవుతోంది. కరోనా నేపధ్యంలో అన్ని కుటుంబాలు ఇళ్లకే పరిమిత కావడం వాస్తవమే అయినప్పటికి ఇన్ని రెట్లు విద్యుత్ చార్జీలు పెరగడం పై ఆశాఖ తీరును వినియోగదారులు తప్పుబడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా అన్ని రాష్ట్రాల పరిధిలో ప్రైవేటు వ్యాపారసంస్థలు, కర్మాగారాలు, వైద్యశాలలు, ఫ్యాక్టరీలు మూతవడి ఉండగా, దీంతో ప్రభుతానికి వినియోగం తగ్గి ఉండాల్సి ఉండగా కొనుగోలు కూడా తగ్గిన నేపధ్యంలో రాష్ట్రానికి కొంత నష్టం తగ్గిందని చెప్పవచ్చు.

Advertisements