ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానానికి, నిన్న అతి పెద్ద ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-467 విమానం, ప్రయాణం మధ్యలో ఉండగా, భారీ గాలి వాన, ఉరుములు భారీ స్థాయిలో మొదలయ్యాయి. ఈ తాకిడికి విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు గురైంది. ఈ పరిణామంతో, ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే భారీగా కుదుపులు రావటంతో, విమానంలోని, వస్తువులు, ఆహరం కోసం ప్రయాణికులకు వద్ద ఉన్న ప్లేట్స్, కాఫీ గ్లాసులు, అన్నీ విమానంలో చిందరవందరగా పడిపోయాయి. అలాగే కుదుపులు తీవ్రతకు విమానంలో ఉన్న వాష్ రూమ్ లోని కమోడ్ సీటు కూడా ఊడిపోయింది. ఈ పరిణామంతో, విమానంలోని కొంత మంది ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు మొదలు పెట్టారు. ఏమి జరుగుతుందో తెలియక, కొంత మంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

delhi 22092019 2

అయితే పైలట్ అప్రమత్తతతో అంతా సేఫ్ అయ్యారు. సిబ్బంది కూడా ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. అయితే ఈ కుదుపులతో, కొంత మంది విమాన సిబ్బందికి కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. చివరకు విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన పై అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. అయితే ఎప్పుడూ వచ్చే బోయింగ్‌ కాకుండా కొత్త సర్వీసు వచ్చిందని గన్నవరం విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పాత ఫ్లైట్ కాకుండా, కొత్తది వచ్చి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఈ ఘటన పై ఎయిరిండియా మాత్రం, ఎలాంటి ప్రకటనా ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలుస్తుంది.

delhi 22092019 3

ఇక మరో పక్క ఇదే సమయంలో, ఢిల్లీ నుంచి తిరువనంతపురం వస్తున్న, మరో ఎయిర్ ఇండియా విమానం కూడా, ఇలాగే గాలి వానలో చిక్కుకుని, పిడుగుల ధాటిగా కుదుపులకు గురైందని తెలుస్తుంది. అయితే ఈ ఫ్లైట్ కి, విజయవాడ ఫ్లైట్ కంటే ఎక్కువగా కుదుపులు వచ్చాయని, అదీ కాక ఈ ఫ్లైట్ లో 172 మంది ప్రయాణికులు ఉండటంతో, మరింతగా కంగారు పడ్డారు. అయితే ఈ ఘటనలో కూడా ఎవరికీ మేజర్ గాయాలు అవ్వలేదు, ఇక్కడ కూడా స్వల్ప గాయాలతో బయట పడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు ఘటనల పై అంతర్గత విచారణ కొనసాగుతుంది. రెండు ఫ్లైట్స్ కి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisements