తెలుగుదేశం పార్టీ నేతల పై, కేసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా, మాజీ మంత్రి దేవినేని ఉమా పై సిఐడి కేసు నమోదు చేసింది. ఇదేదో గతంలో వైసీపీ ఆరోపించినట్టు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఉమా అవినీతి చేసారు అంటూ, ఆధారాలు పెట్టి కేసు పెట్టలేదు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పెట్టిన కేసు. వేల కోట్లు అవినీతి ఆరోపణలపై, ఎక్కడా ఏమి ఆధారాలు దొరకలేదో ఏమో కానీ, చివరకు సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసారు అంటూ, సిఐడి కేసు పెట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే దేవినేని ఉమా తన ట్విట్టర్ లో, ఒక వీడియో పోస్ట్ చేసారు. అందులో జగన్ మోహన్ రెడ్డి, తిరుపతిని కించపరిచే మాటలు ఉన్నాయి. ఎవరైనా గొప్ప వాళ్ళు తిరుపతికి రావటానికి ఇష్టపడరు, అంటూ తిరుపతిని ఒరిస్సా, బీహార్ తో పోల్చారు. అయితే ఈ వీడియో ఫేక్ అంటూ వైసీపీ కంప్లైంట్ ఇచ్చింది. నిజానికి వీడియో మొత్తం ఫేక్ కాదు. 2014లో మ్యానిఫెస్టో విడుదల చేసే సమయంలో, కొత్త రాజధాని గురించి చెప్తూ, మేము ఇలా కడతాం అలా కడతాం అని చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి ఒక ఉదాహరణగా, తిరుపతి లాంటి చోట, ఒరిస్సా, బీహార్ లాంటి చోట ఎవరూ ఉండటానికి ఇష్టపడరు అని అన్నారు. అయితే, దేవినేని ఉమా పోస్ట్ చేసిన వీడియోలో, ఆడియో కరెక్ట్ గానే ఉన్నా, వీడియో మాత్రం, ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి వీడియో పెట్టారు.

uma 11042021 2

ఇదే వీడియోని, దేవినేని ఉమా, ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో కూడా చూపించారు. దీంతో అది మార్ఫింగ్ అంటూ, వైసీపీ హడావిడి చేసి, సిఐడికి ఫిర్యాదు చేసింది. దీంతో దేవినేని ఉమా పై, సిఐడి కేసు నమోదు చేసింది. సెక్షన్ 464, 465, 468, 471, 505 కింద కేసు నమోదు చేసింది. దీని పై విచారణ చేపట్టింది. అయితే సిఐడి కేసు పై, దేవినేని ఉమా ఈ రోజు తీవ్రంగా మండి పడ్డారు. చివరకు ఇలాంటి తప్పుడు కేసులు నా మీద పెట్టి, జగన్ మోహన్ రెడ్డి సంతోష పడుతున్నారు అంటూ, దేవినేని ఉమా మండి పడ్డారు. తాను ఎక్కడ ఫోర్జరీ చేయలేదని, జగన్ మోహన్ రెడ్డి తిరుపతిని కించపరుస్తూ మాట్లాడిన మాటలే, తాను మీడియా ముందు వినిపించానని అన్నారు. తిరుపతిని జగన్ అవమానిస్తే ఏమి లేదు కానీ, తాను అది బయట పెడితే తన పై ఎలా కేసు పెడతారని వాపోయారు. కేసులో పెట్టిన సెక్షన్లు కూడా సంబంధం లేని సెక్షన్లు పెట్టారని, అన్నారు. గొడ్డలి పోటుతో పొతే, గుండె పోటు అని చెప్పిన వాడి పై కేసులు పెట్టుకోండి, ఇలాంటి కేసులతో తనని భయపెట్టలేరని, దేవినేని ఉమా వాపోయారు.

Advertisements