రాష్ట్ర పోలీస్‌ బాస్‌పైనా బదిలీ వేటు పడనురదా? కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ మేరకు కసరత్తు చేస్తోందా? ఈ ప్రశ్నలకు రాష్ట్ర నిఘా వర్గాలు అవుననే అంటున్నారు. డిజిపి ఠాకూర్‌ తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయనను బదిలీ చేయాలని వైసిపి డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకోసం ఆయన తన వాహనంలో నగదును తరలిస్తున్నారని కూడా ఆ పార్టీ ఆరోపించింది. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ కావడంతో ఎన్నికల కమిషన్‌ జోక్యం అనివార్యంగా మారే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచానా వేస్తున్నాయి. అయితే, ఇంటిలిజెన్స్‌ బాస్‌ బదిలీపై చెలరేగిన వివాదం న్యాయస్థానం వరకు వెళ్లడంతో పోలీస్‌ బాస్‌ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

game 27032019

ఇప్పటికిప్పుడు బదిలీపై నిర్ణయం తీసుకోకపైనా నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు ప్రారంభించే అవకాశం ఉందని, పోలిరగ్‌ తేదీకి మూడు నాలుగు రోజుల మురదు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా బదిలీ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, తమ పార్టీపై వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని టిడిపి నేతలు కనకమేడల రవీంద్ర కుమార్‌, జూపూడి ప్రభాకర్‌ పేర్కొన్నారు. మీడియా వాహనాల్లో మారు మూల ప్రాంతాలకు వైసిపి పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తోందని ఆరోపించారు. శుక్రవారం వారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్రం ప్రభుత్వం ఈసిని ఉపయోగించుకొని టిడిపి కార్యకర్తలను, నాయకులను వేధిస్తోందని ఆరోపించారు. వైసిపి నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ని కలిసి డిజిపిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

game 27032019

అయితే బిజెపి, టిఆర్‌ఎస్‌ల అండతో 'సాకి'్ష మీడియా వాహనాలతో వారే డబ్బు తరలిస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు. సాక్షి పత్రిక, టివి ఛానెల్‌లో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కథనాలు రాస్తున్నారని, వాటిని పెయిడ్‌ ఆర్టికల్స్‌గా భావించాలని ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా, విచారణ జరిపి తప్పులుంటే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు టిడిపి తూట్లు పొడిచిందని ప్రధాని మోడీ చేసిన ట్విట్‌ని ఖండిస్తున్నామని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని మోడీ, టిడిపిని, చంద్రబాబుని విమర్శించడానికి రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య శక్తులన్ని ఏకతాటిపైకి వచ్చి మోడీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisements