పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, వింత వ్యాధి వచ్చి ప్రజలు మూర్చ వచ్చి పడిపోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపుగా 300 మందికి పైగా, ఇలా వింత వ్యాధితో బాధపడుతూ, హాస్పిటల్ పాలు అయ్యారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఇందులో ఊపిరి పీల్చుకునే అంశం, ఎవరికీ ఏమి కాలేదు. వెంటనే కోలుకుంటున్నారు. కొంత మందికి సీరియస్ గా ఉంటే, వారిని విజయవాడ తరలించారు. అయితే ప్రభుత్వం మాత్రం పరిస్థితి అంతా అదుపులోని ఉందని, ఏమి ఇబ్బంది లేదని ప్రకటించింది. సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఉండే నియోజకవర్గంలో ఇలా కావటం పై, ప్రతిపక్షాలు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే మరో కీలక అంశం ఏమిటి అంటే, ఈ వింత వ్యాధి అసలు ఎందుకు వచ్చింది ? గాలి కాలుష్యం వల్ల వచ్చిందా ? లేదా నీరు కాలుష్యం వల్ల వచ్చిందా ? దోమ ఏమైనా కుట్టిందా ? లేదా ఏమైనా వైరస్ వచ్చిందా ? వీటి పై ఇప్పటికీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. దాదాపుగా 24 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం ఏమి చెప్పలేక పోతుంది. వివిధ రకాల పరీక్షలు చేసామని, వాటిల్లో ఏమి లేదని, మరిన్ని పరీక్షలు చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితి కారణం, అధ్వాన పారిశుధ్య పరిస్థితి అని, అక్కడ లోకల్ గా ఉండే నాయకులు అంటున్నారు. సరైన విధంగా నీళ్ళ ట్యాంకులు శుభ్రం చేయకపోవటం వల్లే అని అంటున్నారు.

ln 06122020 2

ఇది ఇలా ఉంటే ఈ రోజు ఉదయం మాజీ మంత్రి నారా లోకేష్, ఏలూరు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. హాస్పిటల్ కు వెళ్లి, వాళ్ళకు అసలు ఏమి జరిగిందో తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పి, అవసరం అనుకుంటే మెరుగైన వైద్యం ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని, ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పిస్తామని, వారికి భరోసా ఇచ్చారు. హాస్పిటల్ లో పరామర్శించిన తరువాత, లోకేష్ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఏలూరు దక్షణపు వీధిలో నారా లోకేష్ పర్యటన చేసారు. అయితే అక్కడ ప్రజలు, చుట్టు పక్కల ఉన్న పారిశుధ్యం చూపించటంతో, అవాక్కయ్యారు లోకేష్. ఎక్కడ చూసినా చెత్త, మురుగు నీరుతో పేరుకు పోయి ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న మీడియాకు ఇక్కడ పరిస్థితి చూపించారు. ఇప్పటికీ ఇక్కడ పరిస్థితి మెరుగు పరచటానికి ఎవరూ రాలేదని, ఎక్కడ చెత్త అక్కడే ఉందని అన్నారు. పారిశుధ్య లోపం కారణంగానే, ప్రజలకు ఈ రోజు ఈ ఇబ్బందులు వచ్చాయని అన్నారు. నీళ్ళ ట్యాంకర్ వల్ల అని కొంత మంది, అలాగే నాసిరకం క్లోరిన్ వాడటం వలన ఈ ఘటన జరిగిందని కొంత మంది అంటున్నారని, ప్రభుత్వం ఈ విషయం పై పూర్తి దర్యాప్తు జరపాలని, గాలి ముఖ్యమంత్రి కిందకు దిగి రావాలని లోకేష్ అన్నారు.

Advertisements