ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్ చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పరిస్థితితో పాటు ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు, ఇతర పరిణామాలపై అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రావాలని చంద్రబాబును దేవెగౌడ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే సమయం చూసుకుని వస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అలాగే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, ఈసీ వ్యవహరించిన తీరు, ఇతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.

cbn phone 13042019

ఈ రోజు ఉదయం దిల్లీకి చేరుకొన్న చంద్రబాబు ఏయే అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాలనే అంశంపై పార్టీ నేతలతో చర్చలు జరిపారు. అనంతరం సీఈసీతో సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీవీప్యాట్‌ స్లిప్పులను 50శాతం లెక్కించడంలో ఉన్న ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. ఈ లెక్కింపు తొందరిగా పూర్తయ్యేందుకు ఇతర సంస్థలనుంచి సహాయం తీసుకొనేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని అడిగారు. ఒకదశలో ఈసీపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.

cbn phone 13042019

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంలో ఈసీ వ్యవహరించిన తీరు ఎంత ఆక్షేపణీయంగా ఉందో అర్థమవుతుందా అని నిలదీశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇస్తామని అరోడా చెప్పడంతో సీఎం బయటకు వచ్చారు. ఆ సమయంలోనే అఖిలేశ్‌ యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, దేవెగౌడ నుంచి ఫోన్‌ వచ్చింది. అయితే, కాసేపట్లో సీఎం అందుబాటులో ఉన్న ఎంపీలతో భేటీ అనంతరం తదుపరి కార్యాచరణను సిద్ధంచేస్తారని తెలుస్తోంది.

Advertisements