ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు ఎంతప్రభావం చూపుతున్నాయో తెలియంది కాదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలకు సోషల్‌ మీడియాకు మించిన అస్త్రం లేదు. అయితే యువతను లక్ష్యంగా చేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్‌ నామ స్మరణ చేస్తున్నాయని తాజాగా ఫేస్‌బుక్‌ విడుదల చేసిన డేటాలో రుజువైంది. ఫేస్‌బుక్‌ వేదికగా భారతీయ జనతా పార్టీ పెద్ద మొత్తంలో ప్రకటనలు చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ భారీగానే వెచ్చిస్తోంది. అయితే రాజకీయ నేతల్లో అత్యధికంగా ప్రకటనలకు వెచ్చిస్తున్న వ్యక్తి మాత్రం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌. 2019 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు తీసుకున్న వివరాల ప్రకారం ఫేస్‌బుక్‌ ఈ డేటాను విడుదల చేసింది.

bjp 11032019

భారత్‌లో ఫేస్‌బుక్‌కి వస్తున్న రాజకీయ ప్రకటనల్లో భాజపా, ప్రో-మోదీ పేజీలవే ఎక్కువ. ఇవే ప్రకటనలకు ఖర్చు చేస్తున్నాయి. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్‌ మాత్రం లేదు. ఎందుకంటే గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లో కాంగ్రెస్‌ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. ఫేస్‌బుక్‌ డేటా ప్రకారం... ‘భారత్‌ కే మన్‌ కీ బాత్‌’ పేజీ నుంచి ఫేస్‌బుక్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద సంఖ్యలో ఫీడ్ బ్యాక్‌ వెళ్తోంది. ఇందుకుగానూ ఫేస్‌బుక్‌కు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. 24 రోజుల్లో ఈ పేజ్‌ ద్వారా 1,556 ప్రకటనలు ఫేస్‌బుక్‌కు వెళ్లాయి.ఇందుకు గానూ రూ.1.2కోట్లు ఖర్చయ్యింది. అంటే ఒక్కో ప్రకటనకు రూ.7,700 వెచ్చించారన్న మాట. ఇక ప్రో-నరేంద్ర మోదీ పేజీకి సామాజికమాధ్యమాల వేదికగా 3లక్షల మంది ఫాలోవర్లున్నారు.

bjp 11032019

‘నేషన్‌ విత్‌ నమో’ అనే పేజీకి 1.1 మిలియన్‌ మంది ఫాలోవర్లున్నారు. ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వడంలో ఇది రెండో స్థానంలో ఉంది. ఫిబ్రవరి నుంచి ఈ పేజీ 1,074 ప్రకటనలు ఇవ్వగా ఇందుకు గానూ రూ.64 లక్షలు వెచ్చించింది. అంటే ఒక్కో ప్రకటన వెల రూ.6,000. ఇక ఈ జాబితాలో ‘మైగవ్‌ఇండియా’ మూడో స్థానంలో ఉంది. ఇది 123 ప్రకటనలకు గానూ రూ.34లక్షలు వెచ్చింది. ఒక్కో ప్రకటన వెల రూ.27 వేలు. ఈ పేజీకి 3,70,000మంది ఫాలోవర్లున్నారు. నాలుగో స్థానంలో న్యూస్‌ యాప్ అయిన ‘డైలీ హంట్‌’ ఉంది. ఇది ఒక్కో ప్రకటనకు రూ.2లక్షలకు పైగా వెచ్చించి ఇప్పటివరకు 16 యాడ్లకు గానూ రూ.33లక్షలు చెల్లించింది. సగటున ఎంతంటే..? బేబీ చక్ర అనే అన్‌లైన్‌ పేరెంటింగ్‌ యాప్‌ ఒక్కో ప్రకటనకు సగటున రూ.6.2 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. ఇక డైలీ హంట్‌ ఒక్కో యాడ్‌కు రూ.5.4 లక్షల చొప్పున ఖర్చు చేస్తోంది. ఇక ఈ జాబితాలో భారతీయ జనతా పార్టీ మూడో స్థానంలో నిలిచింది. సగటున భాజపా ఒక్కో యాడ్‌కు రూ.3.3లక్షల చొప్పున ఖర్చు పెడుతోంది.

Advertisements