Amaravati Voice | Latest Telugu News | Vijayawada | Guntur https://www.amaravativoice.com/avnews/news/ Wed, 04 Mar 2026 07:20:26 +0000 Joomla! - Open Source Content Management en-gb మొత్తం ప్రెస్ మీట్ లో, మీడియా ఆశ్చర్యపోయిన విషయం ఇదే... చంద్రబాబుని రెండో సారి రిపీట్ చెయ్యమన్నారు... https://www.amaravativoice.com/avnews/news/cbn-about-modi-in-press-meet https://www.amaravativoice.com/avnews/news/cbn-about-modi-in-press-meet

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం దిల్లీ బాట పట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ పార్టీల నేతలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా సోమవారం రాత్రి దిల్లీకి వెళ్లిన సీఎం ఇవాళ సాయంత్రం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో చంద్రబాబు చెప్పిన ఒక విషయం మాత్రం నేషనల్ మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది... మళ్ళీ ఒకసారి చెప్పండి అంటూ, చంద్రబాబుని అడిగారు... దీని పై చంద్రబాబు మరో సారి స్పష్టం చేస్తూ, ఆధారాలు కూడా చూపించారు... ఆ విషయం ఏంటి అంటే..

{loadposition myposition}

cbn 04042018 1

ఫిబ్రవరి 4 నుంచి మా ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు... ఇలా డబ్బులు వేసి మరీ, వెనక్కు తీసుకోవటం ఎక్కడన్నా చూసారా ? ఇదిగోండి ఆధారాలు అంటూ, ఎకౌంటు లో డబ్బులు పడిన ఎంట్రీ, వెంటనే డబ్బులు వెనక్కు తీసుకున్న ఎంట్రీ కాపీలు చూపించారు... ఈ విషయం తెలుసుకున్న విలేకరులు ఆశ్చర్యపోయారు...

cbn 04042018 1

ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... వీరి కక్ష ఇలా ఉంటుంది... నాలుగేళ్ల ముందు చంద్రబాబు బయటకు వచ్చి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి... పోలవరం అసలు మొదలే అయ్యేది కాదు... అమరావతికి ఎన్నో ఇబ్బందులు వచ్చేవి (పర్మిషన్ల గురించి)... నాలుగేళ్లు అయ్యాకనే మనకివ్వాల్సింది మనం అడిగితే ఇంత పెడసరిగా వెళుతున్న వారు తొలిరోజు నుంచే చంద్రబాబు దూకుడుగా వెళ్లివుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది.

]]>
news Wed, 04 Apr 2018 14:52:34 +0000
ఉత్తరాంధ్ర వైపు పెను తుఫానుగా మారి వస్తున్న 'ఫొని'... https://www.amaravativoice.com/avnews/news/cyclone-fani-heading-towards-north-andhra https://www.amaravativoice.com/avnews/news/cyclone-fani-heading-towards-north-andhra

‘ఫొని’ తుపాను తీవ్రత పెరుగుతోంది. ఈనెల 30, మే 1వ తేదీల్లో దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా దిశగా కదిలే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న ‘ఫొని’ 30న అతి తీవ్రంగా, మే 1న పెను తుపానుగా మారనుంది. మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరం సమీపానికి రానుంది. అయితే ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది వాతావరణశాఖ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. సోమవారం ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం తుపాను ట్రింకోమలీకి 620 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 880 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. మే 1వ తేదీ నాటికి పెను తుపానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా ప్రయాణించే అవకాశాలున్నట్లు పేర్కొంది.

{loadposition myposition}

cyclone 29042019

ఆ సమయంలో గాలుల వేగం 150 కి.మీ. నుంచి 185 కి.మీ. వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 29, 30 తేదీల్లో, కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కేరళలో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. అలాగే మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, ఒడిశా తీరంలో భారీ వర్షాలకూ అవకాశమున్నట్లు వివరించారు. ఈనెల 30న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరంలో గంటకు 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆ తర్వాత మే 2న ఏపీ, ఒడిశా తీరాల్లో గంటకు 40-60 కి.మీ., 3న ఒడిశా తీరంలో 50-70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

cyclone 29042019

ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రం చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. 30న ఇది మరింత తీవ్రంగా మారుతుందని అంటున్నారు. ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల్లో, మే 1- 3 తేదీల మధ్య ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో సముద్రం చాలా చురుగ్గా ఉంటుందని తెలిపారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.

]]>
news Mon, 29 Apr 2019 07:39:11 +0000
2010లో జగన్ రాసిన లేఖ విడుదల చేసి, నువ్వు అసలు సియం వేనా, అంటూ మందకృష్ణ ఫైర్... https://www.amaravativoice.com/avnews/news/mandakrishna-fire-on-jagan https://www.amaravativoice.com/avnews/news/mandakrishna-fire-on-jagan

జగన్ మోహన్ రెడ్డి పై, ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర స్వరంతో విమర్శలు చేసారు. నువ్వు ముఖ్యమంత్రివా ? లేక మాల మహానాడు అధ్యక్షుడివా అంటూ, విమర్శలు గుప్పించారు. వర్గీకరణకు జగన్ అడ్డు పడుతున్నారని, మందకృష్ణ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మేనమామలు అందరూ మాలలు కాబట్టి, వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్నారని మందకృష్ణ అన్నారు. గుంటూరులో మాట్లాడుతూ, జగన్ పై ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న చంద్రబాబు పై, విమర్శలు చేసారని, కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు మాల, మాదిగ మధ్య చిచ్చు పెట్టారు అని మాకు మద్దతుగా ఉన్న చంద్రబాబుని విమర్శిస్తున్నారని అన్నారు.

{loadposition myposition}

mrps 2007219 1

వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వారిని, బెదిరించే దొరినలో జగన్ ప్రవర్తిస్తున్నారని అనంరు. జగన్ మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే గుంటూరు నుంచి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి స్వయానా వర్గీకరణ కోరుతూ అప్పట్లో ఉత్తరాలు రాసారని, మరి ఇప్పుడు ఎందుకు యుటర్న్ తీసుకున్నారని అన్నారు ? అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, జగన్ మోహన్ రెడ్డి వర్గీకరణ చెయ్యాలి అంటూ, రాసిన లేఖను చూపించారు. దీనికి సమాధానం చెప్పాలని కోరారు. అప్పట్లో వర్గీకరణకు సరే అని, ఇప్పుడేమో, తమ కుటుంబీకులు మాలలు ఉన్నారు కాబట్టి, వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ, సామాజిక న్యాయం చెయ్యాలి కదా అని ప్రశ్నించారు.

mrps 2007219 1

అలాగే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, వర్గీకరణకు పూర్తీ అనుకూలంగా ఉన్నారని, వైఎస్ చనిపోయే ముందు ఆయన వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, ఇది వైఎస్ చివరి కోరిక అని, తండ్రి కోరిక కూడా నెరవేర్చలేని కొడుకుగా జగన్ ఉంటారా అని ప్రశ్నించారు. అప్పటి న్యాయ శాఖా మంత్రి వీరప్ప మొయిలీని కలిసిన సమయంలో, తాను జగన్ పక్కనే ఉన్నానని, కడప ఎంపీ హోదాలో, వర్గీకరణ చెయ్యాల్సిందే అని లేఖ ఇచ్చారని గుర్తు చేసారు. దీనికి సాక్ష్యం ఆ రోజు అక్కడే ఉన్న అనంతపురం ఎంపీ వెంకటరామిరెడ్డి అని అన్నారు. వైసిపీ మొదటి ప్లీనరీలో కూడా ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన తీర్మానం చేసారని గుర్తు చేసారు. కాని ఇప్పుడు జగన్ మాట తప్పారని, మడం తిప్పారని, అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే మాట మార్చారని అన్నారు. జగన్ రాసిన లేఖలు, ప్లీనరీ ప్రసంగం, వైఎస్ఆర్ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న డాక్యుమెంట్లు అన్నీ తీసుకువెళ్ళి జగన్ కు ఇస్తామని మందకృష్ణ అన్నారు.

]]>
news Sat, 20 Jul 2019 08:33:40 +0000
ఏమి తమాషాలా ? సస్పెండ్ చేసి పారేయండి.. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం.. https://www.amaravativoice.com/avnews/news/gudlavalleru-engg-colleges-cbn-angry https://www.amaravativoice.com/avnews/news/gudlavalleru-engg-colleges-cbn-angry

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా....బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించారు. ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీసు అధికారి తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్థినులతో అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదని...ఇలాంటి పోకడలను సహించేదిలేదన్నారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు నుంచి వివరణ కోరారు. దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని...బందోబస్తు కోసం పిలిపించామని అధికారులు వివరించారు. ఘటన అనంతరం అమెను ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని తెలిపారు. ఘటనపై ఎస్ ఐ నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని...వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

]]>
news Sun, 01 Sep 2024 04:24:56 +0000
వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్.. అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది.. https://www.amaravativoice.com/avnews/news/vizag-chenni-industrial-corridor https://www.amaravativoice.com/avnews/news/vizag-chenni-industrial-corridor

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గేం చేంజర్.. పోలవరం, అమరావతి తరువాత, చంద్రబాబు గారు కేంద్రం దగ్గర పెట్టిన మరో ముఖ్యమైన ప్రపోజల్ ఇది. మొన్న బడ్జెట్ లో దీని పై కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇది విభజన చట్టం ప్రకారం, చట్ట ప్రకారం మనకు వచ్చిన ప్రాజెక్ట్. విభజన చట్టంలోని సెక్షన్‌ 93లో పొందుపరిచారు. దాని ప్రకారం 2014 జూన్‌ 2 నుంచి ఆరు నెలల్లోపు దీనిపైన అధ్యయనం చేయించి, దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌ తరహాలోనే నిర్దిష్ట కాలపరిమితిలోగా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి అని ఉన్నా, 10 ఏళ్ళు అయినా ఆతీ గతి లేదు.

అసలు ఏంటీ ప్రాజెక్ట్ ?
మన దేశంలో మొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్ ఇది. మొత్తం నాలుగు ఆర్థిక కేంద్రాలు, తొమ్మిది పారిశ్రామిక సముదాయాలు ఉంటాయి. విశాఖపట్నం (6,931 ఎకరాలు), మచిలీపట్నం (12,145 ఎకరాలు), శ్రీకాళహస్తి-ఏర్పేడు (26,425 ఎకరాలు), దొనకొండ (17,117 ఎకరాలు) నోడ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నాడు ప్రతిపాదించింది. సుమారు 800 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. ఈ కారిడార్ పూర్తయితే, ఒక కోటి ఇరవై లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అందుకే చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కోసం అంతలా వెంటబడుతుంది.

ఇందులో ఏమి చేస్తారు..
ఇండస్ట్రీలు పెట్టటానికి మౌలికరంగ వసతుల అభివృద్ధి చేస్తారు. రహదారులు, తాగునీటి పైప్ లైనులు, డ్రెయిన్లు, పవర్ సబ్ స్టేషన్లు ఇలా.. ప్రస్తుత జాతీయ రహదార్లకు అనుసంధాన రహదార్లు, రైల్వేలైన నిర్మాణం చేస్తారు. ఓడరేవులకు.. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తారు. విదేశాలకు సరుకును ఉత్పత్తి చేసేలా మౌలిక సదుపాయాల కల్పన ఉంటుంది. దీని నిర్మాణంతో తూర్పతీర పారిశ్రామిక రూపురేఖలు వూరిపోతాయి.

మౌళిక వసతలు వచ్చాక ఏమి అవుతుంది ?
వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్ మౌళిక వసతులు నిర్మాణంతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం అందుబాటులోకి వస్తుంది. సమర్థవంతమైన రవాణా, నీరు, విద్యుత సరఫరా, నిపుణులైన పనివాళ్లు, పారిశ్రామిక అనుకూల విధానాలు, అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థల ఏర్పాటుతో, పెట్టుబడులకు అవకాశాలు ఉంటాయి. ఈ కారిడార్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్నుంచి రాయితీలందుతాయి. అలాగే ఈ కారిడార్కు జాతీయ రహదార్లు, రైల్వే ప్రధాన లైన్లతో అనుసంధానముంటుంది. తీరం వెంబడి కొన్ని మధ్యతరహా పోర్టుల నిర్మాణానికి అవకాశాలొస్తాయి. దేశంలోని ఇతర కారిడార్లతో పోలిస్తే విమానాశ్రయాలు, రేవులు, జాతీయ రహదార్లు, ప్రధాన రైలు మార్గాలకు అత్యంత దగ్గరలో ఉన్న కారిడార్ ఇదొక్కటే.

అలాగే ఈ కారిడార్ వెంబడన్నప్రాంతాల్లో ఎప్పడూ ఎలాంటి కార్మిక అశాంతి లేదు. రాజకీయ సుస్థిరత ఉంది. సైకో గాడు ఎంత చించుకున్నా, ఇక్కడ ఏమి చేయలేడు.

ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు తూర్పు దేశాలు, ఈస్ట్ కోస్ట్ కంటే, వెస్ట్ కోస్ట్ ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. మన తూర్పు తీరం దాటుకుని, పశ్చిమ తీరానికి వెళ్తున్నారు. ఒకరకంగా ఇన్నాళ్ళు ఈస్ట్ కోస్ట్ డెవలప్ చేయకపోవటం వెనుక, కుట్ర కూడా ఉంది..అది వేరే విషయం..

షార్ట్ గా చెప్పాలి అంటే, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తే ప్రయోజనాలివి...
* జీడీపీ ఆరు రెట్లు పెరుగుతుంది
* తయారీ రంగ సామర్థ్యం భారీగా పెరుగుతుంది
* 1.10 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
* ఆ ప్రాంతం మొత్తం, మౌళిక సదుపాయాలు టాప్ క్లాస్ లో ఉంటాయి

పదేళ్ళ నుంచి విశాఖపట్నం -చెన్నై పారిశ్రామిక కారిడార్ లో ఏమి జరిగింది ?
ఇప్పుడు కేంద్రం బడ్జెట్ లో పెట్టిందని, కేంద్రాన్ని ప్రసంసిస్తున్నాం కానీ, ఇప్పటి వరకు ఇది లేట్ అవటానికి కారణం కేంద్ర ప్రభుత్వం, గత 5 ఏళ్ళు పట్టించుకోని జగన్ రెడ్డి.

చంద్రబాబు ఉండగా, 2014-19 మధ్య ఇందులో కొంత కదలిక వచ్చింది . ఈ కారిడార్ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4,170 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. ఏడీబీ ఇస్తున్న రుణం కేంద్రమే తరువాత చెల్లిస్తుంది. రాష్ట్రానికి సంబంధం ఉండదు. మరో రూ.1,419 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తారు.

అయితే నాటి రాష్ట్ర ప్రభుత్వం రూ.535 కోట్లను భూ సేకరణ, ఇతర అవసరాలకు చెల్లింపులు జరిపింది. కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది. 2018 తరువాత చంద్రబాబు మోడీతో విబేధించటంతో, ప్రాజెక్టుపై కొర్రీల మీద కొర్రీలను వేస్తూ కేంద్రం కాలయాపన చేసింది. తొలిదశలో భాగంగా పారిశ్రామిక, పట్టణ మౌలిక వసతులు, రోడ్లు, పవర్‌ ప్రాజెక్టులు తదితర 11 ప్రాజెక్టులు చేపట్టాలనేది ప్రతిపాదన. వీటిల్లో ఒక్కదానికే టెండర్లు ఖరారయ్యాయి. మిగతావన్నీ బిడ్డింగ్‌ దశలోనే నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ ఇలా ఉండగానే, జగన్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. తన కేసులు తప్ప, ఈ ప్రాజెక్ట్ గురించి ఏ నాడు పట్టించుకుంది లేదు.

ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ వచ్చాడు. రావటంతోనే, మొదటి ఢిల్లీ పర్యటనలో, అమరావతి, పోలవరం తరువాత వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్ పైనే ఫోకస్ పెట్టి, కేంద్ర బడ్జెట్ లో పెట్టించి స్పష్టమైన హామీ తీసుకున్నారు. వచ్చే రెండేళ్ళలో ఈజీగా మొదటి దశ పూర్తి చేసేయొచ్చు.

]]>
news Sun, 28 Jul 2024 11:13:11 +0000
పిన్నెల్లికి బెయిల్ ఇచ్చి అపహాస్యం చేసారు.. హైకోర్టు పై, సుప్రీంకోర్టు ఆగ్రహం https://www.amaravativoice.com/avnews/news/pinnelli-supreme-court https://www.amaravativoice.com/avnews/news/pinnelli-supreme-court

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. నంబూరి శేషగిరిరావు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లొద్దని ఆదేశించింది. కేవలం కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఏపీ హైకోర్టు, పిన్నెల్లిని ఈనెల 6 వరకు అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేయగా, ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు ఉపశమనం కల్పించడం హైకోర్టు చేసిన తప్పు అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.

]]>
news Mon, 03 Jun 2024 06:46:55 +0000
5 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, చివరి రోజు దిగొచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్.. https://www.amaravativoice.com/avnews/news/ab-venkateswara-rao-posting https://www.amaravativoice.com/avnews/news/ab-venkateswara-rao-posting

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడానికి ఫైల్ సిద్ధం చేసింది. నిన్న హైకోర్టు, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది, క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏబీవీని సర్వీస్‌లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నందున, పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశాయి. ఈమేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీస్‌లోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కాసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

]]>
news Fri, 31 May 2024 05:22:12 +0000
కొత్త ప్రభుత్వం రాబోతోంది... ఓ జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలతో అందరూ షాక్ https://www.amaravativoice.com/avnews/news/collector-about-govt-change https://www.amaravativoice.com/avnews/news/collector-about-govt-change

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని సమాచారం ఉందని ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే ఉద్యోగులు జాగ్రతలు పాటించండి అంటూ ఓ జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు సూచించారు. సదరు కలెక్టర్ ఆ మాటలు చెప్పటంతో ఆ సమావే శంలో ఉన్న ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సదరు కలెక్టర్ కు అధికార వైసీపీకి వీర విధేయుడు అని ఆ జిల్లాలో పేరుంది. అలాంటి వీర విధేయుడి నోట స్వయంగా ప్రభుత్వం మారబోతున్నట్టుగా జాగ్రత్తలు చెప్పటం సమావేశానికి హాజరైన ఉద్యోగులకు ఆనందం కలిగించింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుందన్న విశ్వాసం ఉద్యోగుల్లో మరింత పెరిగింది. కలెక్టర్ గురించి తెలిస్తే వైసీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆ జిల్లా ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

]]>
news Mon, 27 May 2024 10:49:32 +0000
రిటైర్మెంట్ కు మరో నాలుగు రోజులే.. ఏబీ వెంకటేశ్వరరావు కు పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ https://www.amaravativoice.com/avnews/news/suspense-continues-on-ab-venkateswarara-posting https://www.amaravativoice.com/avnews/news/suspense-continues-on-ab-venkateswarara-posting

సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కు ఇంకా కేవలం 4 రోజులే సమయం ఉండడం తో సర్వత్రా చర్చ సాగుతోంది. యూనిఫాంతో, పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో పోరాడుతున్నారు ఏబి వెంకటేశ్వరరావు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ ఈ నెల 8 న కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (CAT) తీర్పు ఇచ్చింది. అయితే, CAT తీర్పు అనంతరం కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది.

CAT తీర్పును నిలుపుదల చేయాలంటూ హై కోర్ట్ కు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావు చివరి రోజు వరకు పోస్టింగ్ దక్కకుండా చూసే ప్రయత్నాల్లో ఉంది. సీఎం జగన్ రెడ్డి కుట్రలో భాగస్వామిగా మారిన ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కోర్ట్ లో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం ఏబీ వెంకటేశ్వరరావు భవిష్యత్తు గురించి తక్షణ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

{loadposition myposition}

ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కు ఇంకా కేవలం 4 రోజులే గడువు ఉండడంతో కోర్ట్ తీర్పు, ప్రభుత్వ తదుపరి చర్యలపై అన్ని వర్గాల్లో చర్చ, ఉత్కంఠ నెలకొంది. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 2019 మే 30 నుంచి వెంకటేశ్వరరావు కు పోస్టింగ్ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం, అదే రోజు ఇచ్చిన రెండో జీవో లోనే వెంకటేశ్వరరావు పోస్టింగ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయనపై కేసులు పెట్టి రెండు సార్లు సస్పెన్షన్ విధించారు.

గత 5 ఏళ్లుగా కేసుల పై, ఉద్యోగం కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న వెంకటేశ్వరరావు, ప్రభుత్వంతో, వ్యవస్థలతో ఒంటరిగా పోరాటం చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పోస్టింగ్ పై పౌర సమాజం నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావు చివరి నిమిషం వరకు పోరాడుతూ, తన యూనిఫాంతోనే రిటైర్డ్ అవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నెల 31 తరువాత ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉండగా, CAT తీర్పు అమలు చేయడం ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగేనా లేదా అన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ.

]]>
news Sun, 26 May 2024 11:54:01 +0000
పిన్నెల్లి ఎంత రాక్షసుడో చూడండి.. మాచర్ల నుంచి పారిపోయి వచ్చి, టిడిపి ఏజెంట్ సంచలన ప్రెస్ మీట్ https://www.amaravativoice.com/avnews/news/macharla-tdp-polling-agent https://www.amaravativoice.com/avnews/news/macharla-tdp-polling-agent

కత్తిపట్టిన వాడు కత్తితో గొడ్డలి పట్టినవాడు గొడ్డలితో.. దౌర్జన్యం చేసిన వాడు దౌర్జన్యానికి బలికావడం ఖాయం. పిన్నెల్లి అరాచకాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పిన్నెల్లిపై పోలీసు శాఖ జూలు విప్పుతోంది. పిన్నెల్లి బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి తమ గొంతు వినిపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నా ఎస్సీ, నాఎస్టీ నా బీసీలు అంటూనే జగన్ రెడ్డి అతని తొత్తులు దళితులపైనే దాడులకు తెగబడుతున్నారు. వారి గొంతులు కోస్తున్నారు. పిన్నెల్లి సొంత గ్రామం కండ్లకుంటలో నోముల మాణిక్యరావుపై దాడే దీనికి నిదర్శనం. ఒక దళిత బిడ్డ టీడీపీకి మద్దతుగా బూత్ ఏజెంట్ గా కూర్చుంటే.. మాదిగ నా కొడక నువ్వు బూత్ ఏజెంట్ గా కూర్చునే వాడివారా అంటూ అతన్ని నానా దుర్భాషలాడుతూ.. అతనిపై రాడ్లు కర్రలతో దాడి చేశాడు. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు చోద్యం చూశారే కాని అడ్డుకోలేదు. వెంకట్రామిరెడ్డి కాళ్ల మీద పడినా వదలకుండా మాణిక్యాలరావు భార్య బిడ్డలపై ఘోరంగా దాడి చేసి దాన్ని వీడియో తీసి మాణిక్యరావుకు చూపించారంటే మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా అనిపిస్తుంది. మరో టీడీపీ ఏజెంట్ దుర్గంపూడి వెంకట్రెడ్డి అతని కొడ్డుకులను కర్రలు రాడ్లతో కొట్టి చంపేందుకు యత్నిస్తుంటే అడ్డుకోబోయి అతని బిడ్డను వివస్త్రను చేయడం మహిళా లోకానే కించరచడం. ఇటువంటి కిరాతకులను చెప్పుతో కొట్టాలి.

దళిత బిడ్డ ఏజెంటుగా కూర్చోవడం పాపమా? ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఉండకూడదా..? ఎస్సీలపై ఇంత అరాచకంగా దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోరా? 13 రోజుల నుండి మణిక్యరావు భార్య బిడ్డలను వదిలి తిరుగుతున్నాడు. బయట ఊర్లలో ప్రాణాలు రక్షించుకుంటున్నాడు. మాచర్ల వెళితే మాణిక్యరావును చంపేస్తారు. వెంటనే పిన్నెల్లి, అతిని సోదరుడు వెంకట్రామిరెడ్డి అరాచకాలపై డీజీపీ, ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి. చంబల్ లోయ దుర్మార్గుల కంటే పిన్నెల్లి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలు వెయ్యిరెట్లు దారుణంగా ఉన్నారు. వీళ్ల అరాచకాలు చూస్తుంటే ఏపీలో ఉన్నామా? టెర్రరిస్ట్ గ్రామాల్లో ఉన్నామా అనిపిస్తుంది. పోలీసు వ్యవస్థ బెల్ట్ ఇకనైనా టైట్ చేసి అరాచకపరులను కటకటాల్లోకి నెట్టాలి.

{loadposition myposition}

బాధితుడు మాణిక్యరావు మాట్లాడుతూ... పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి మా సొంత ఊరు కండ్లకుంట గ్రామం బూత్ నెంబర్ 144 లోకి వచ్చి నన్ను దుర్భాషలాడారు. అంతుచూస్తామని నన్ను బెదిరించాడు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. టీడీపీ ఏజెంట్ గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది మాదిగ నా కొడక అంటూ తిడుతూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అతని అనుచరులు 300 మంది నా కుటుంబంపైన దాడి చేశారు. పిన్నెల్లి నా పెద్దకుమారుడి పొత్తికడుపుపై తన్నాడు. వెకంట్రామిరెడ్డి అతని అనుచరులు నా చిన్న కొడుకుని, భార్యను రాడ్లు కర్రలతో కొట్టారు. నా భార్య బిడ్డలను కొడుతున్న దృశ్యాలను వారి అనుచరుల మొబైల్ కు వీడియో కాల్ చేసి.. అది నాకు చూపిస్తూ నన్ను హేళన చేస్తూ... చూడరా నీ భార్య బిడ్డల దుస్థితి అంటూ ఇప్పటికైన నా కొడక బూత్ నుండి బయటకు వెళతావా లేదా అని దుర్భాషలాడతూ మానసికంగా నన్ను హింసించి మనో వేదనకు గురి చేశారు.

మా ఇంటికి అతి సమీపంలో ఉన్న మరో బూత్ ఏజెంట్ అయిన దుర్గంపూడి వెంకట్రరెడ్డి ఇంటిపైకి వెళ్లి వెంకట్రరెడ్డి కుమారులను తీవ్రంగా కొడుతున్న సందర్భంలో వెంకట్రరెడ్డి కుమార్తె అడ్డు వస్తే ఆమెను కూడా వివస్త్రను చేసి పైశాచిక ఆనందం పొందారు. నా భార్య భయపడుతూ ఫోన్ చేసి వారు ఎంతకైనా తెగిస్తారు దయచేసి ఇక్కడికి రావద్దు.. చంపేస్తారని చెప్పగా నేను ట్రైనీ డీఎస్పీ జగదీష్ దగ్గరకు వెళ్లి జరిగింది అంతా చెప్పి నా ప్రాణాలతో పాటు నా కుటుంబాన్ని, దుర్గంపూడి వెంకట్రెడ్డి కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నాను.

నా భార్య బిడ్డలను కొట్టవద్దని నా వదిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమాలినా వదల్లేదు. నా కుటుంబంపై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి అంత కక్ష ఎందకు? పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి భయపడి అధికారులు నోరు మెదపలేదు. నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు. ట్రైనీ డీఎస్పీ జగదీష్ ఉండగానే పిన్నెల్లి రామకృష్ణ, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి నాపై దాడికి యత్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం వెంకట్రామిరెడ్డి బెదిరించాడు.

వెంటనే డీఎస్పీ నాతో పాటు మరో ముగ్గురు టీడీపీ ఏజెంట్లను వారి వాహనంలో ఎక్కించుకుని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మాకు భద్రత కల్పించాలని చెప్పి వెళ్లిపోయారు. అక్కడి పోలీసులు మా ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. తరువాత టీడీపీ కార్యకర్తలు వచ్చి కూటమి అభ్యర్థి అయిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తరువాత ప్రాణ భయంతో హైదరాబాద్ పారిపోయాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాపై జరిగిన దాడిని తెలుసుకుని నాకు ఫోన్ చేసి పరామర్శించారు. నాకు నా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వర్ల రామయ్యను కలవమని చెప్పారు. వర్ల రామయ్య గారు నేను ఒక దళిత బిడ్డనని తెలుసుకుని ఆయన నాకు అండగా నిలబడ్డారు. నాకు దౌర్యం ఇచ్చారు. ఈ అరాచకాలపై పోలీసులకు ఈసీకి ఫిర్యాదు చేస్తాం.

]]>
news Sun, 26 May 2024 11:22:39 +0000