నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా చరిత్రపుటల్లో నిలిచిన డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుపై దాడితో పల్నాడు ప్రజల్లో అభద్రతా భావం నెలకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని, వైసీపీ రౌడీలు ఎంతకు తెగబడతారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలింగ్‌ రోజున సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్లలో స్పీకర్‌ కోడెలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల అనుభావాల నేపథ్యంలో అక్కడ రిగ్గింగ్‌ జరిగే అవకాశం ఉందని స్పీకర్‌ ముందే అనుమానించారు. దాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆయన గ్రామానికి వెళ్లారు. వెంట ఎలాంటి మందీ మార్భలం లేకుండా ఇద్దరు గన్‌మెన్లు, మరో ఇద్దరు సహాయ సిబ్బంది ( డ్రైవర్‌తో కలపి)తో అక్కడికి చేరుకున్నారు. తన వెంట వచ్చిన వారిని బయటే ఉంచి స్పీకర్‌ బూత్‌లోకి ప్రవేశించారు.

kodela 14042019

కొద్ది సేపు పోలింగ్‌ సరళిని పరిశీలించి సక్రమంగా ఉంటే వెనుతిరుగుదామన్న ఉద్దేశంతో ఆయన అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు. అంతకు ముందే రిగ్గింగ్‌ ఎలా చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించుకున్న వైసీపీ వర్గీయులు కొంత మందికి కోడెల అక్కడకు రావడం కంటగింపుగా మారిందని స్థానికుల అభిప్రాయం. ఆయన బూత్‌ వద్ద ఉంటే తమ ఆటలు సాగవని భావించే కోడెలపై దాడికి తెగబడారని స్థానికులు విశ్లేషిస్తున్నారు. బయటకు వెళ్లాలన్న సాకు చూపి దాడికి తెగబడ్డారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బయట ఉన్న గన్‌మెన్లు లోనికి వెళ్లి కోడెలను బయటకు తీసుకువచ్చారు. అప్పటికి కొంత మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. వారిలోనూ కొంత మందిని రక్తం వచ్చేలా వైసీపీ రౌడీ మూకలు కొట్టారు.

kodela 14042019

కోడెలపైనా టీడీపీ వర్గీయులు మరికొంత మందిపైనా వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగబడటంతో కోడెలకు ప్రాణహాని కలుగుతుందేమోనని ఆందోళన చెందిన గన్‌మెన్లు ఫైరింగ్‌ చేస్తామని కోడెలను అడిగారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. అలా చేస్తే ఆ అల్లరి మూకల ప్రాణాలు పోతాయని, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని వారించారు. ఇదే సమయంలో ఈ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడి పోలింగ్‌కు భంగం కలుగుతుందని వారికి అనుమతి ఇవ్వలేదని పక్కనున్న వారు చెప్పారు. ఉదయం 11 గంటలకు కోడెలపై దాడి జరిగితే గంట వ్యవధిలోనే ఈ విషయం రాష్ట్రం మొత్తం పాకింది. దీంతో అప్పటి వరకు ఈవీఎంలు పని చేయడం లేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్న చాలా మంది పెద్ద ఎత్తున ఓటింగ్‌కు వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisements